పొలిటిక‌ల్ ఎంట్రీపై ర‌జ‌నీకాంత్ మాట‌..!

Fri,June 16, 2017 01:06 PM
Rajini likely to announce political party name on his birthday

2009లో శివాజీ సినిమా సక్సెస్ తర్వాత ఫ్యాన్స్‌తో సమావేశమైన రజనీ, మ‌రోసారి ఆగ‌స్ట్ లో వారితో క‌లిసి పార్టీకి సంబంధించి భారీ చ‌ర్చ‌ జ‌ర‌ప‌నున్నాడ‌నే వార్త ప్ర‌స్తుతం త‌మిళనాట హాట్ టాపిక్ గా మారింది. జూలైలో ర‌జ‌నీకాంత్ త‌న పార్టీని ఎనౌన్స్ చేస్తార‌ని ఆయన సోద‌రుడు ప్ర‌క‌టించినప్ప‌టికి, హ‌డావిడిగా దీనిపై ఎలాంటి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేయ‌ద‌లచుకోలేదని తెలుస్తుంది. ఇప్ప‌టికే త‌న అభిమానుల‌కి కూడా ర‌జ‌నీ కొన్ని విష‌యాల‌లో సూచ‌న‌లిచ్చారు. టెలివిజ‌న్ డిబేట్స్ లో అస్స‌లు పార్టిసిపేట్ చేయోద్ద‌ని, ఫ్యాన్స్ క్ల‌బ్ సీనియర్ మెంబ‌ర్స్ స‌ల‌హాల ప్ర‌కారం న‌డుచుకోవాల‌ని ఆయ‌న తెలిపారు. అయితే ర‌జ‌నీ త‌న పార్టీ ప్ర‌క‌ట‌న‌ని తానే స్వ‌యంగా బ‌ర్త్ డే రోజు ఎనౌన్స్ చేస్తాడ‌ని కొన్ని త‌మిళ పత్రిక‌లు చెబుతున్నాయి. డిసెంబర్ 12 త‌లైవా బ‌ర్త్ డే సంద‌ర్భంగా త‌మిళ నాట ఓ పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొన‌నున్న నేప‌థ్యంలో ఆ రోజే త‌న పార్టీ పేరు, ప్ర‌ణాళిక‌లు ర‌జ‌నీకాంత్ వివరాస్తాడ‌ని చెబుతున్నారు. మ‌రో వైపు అదే రోజు ర‌జనీకాంత్ చేస్తున్న కాలా సినిమా టీజ‌ర్ కూడా విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇంక శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న 2.0 చిత్రానికి సంబంధించి కూడా ఏదో ఒక‌టి ఫ్యాన్స్ కి గిఫ్ట్ గా రిలీజ్ కానున్న‌ట్టు టాక్. మ‌రి డిసెంబ‌ర్ 12న అభిమానుల‌కు ఇన్ని స‌ర్ ప్రైజ్ లు దొరుకుతుండ‌గా, వారి ఆనందం ఏ లెవ‌ల్ కి వెళుతుందో చూడాలి.

1385
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles