HomeLATEST NEWSrajendra prasad receives life achievement award

రాజేంద్ర‌ప్ర‌సాద్‌కి జీవిత సాఫ‌ల్య పుర‌స్కారం

Published: Wed,September 19, 2018 09:24 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   
వెండితెర‌పై త‌న‌దైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ని క‌డుపుబ్బ న‌వ్వించిన కామెడీ హీరో రాజేంద్ర ప్ర‌సాద్‌. ప్ర‌స్తుతం స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ చేస్తూ అల‌రిస్తున్నాడు. ఆయ‌నకి ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం జీవిత సాఫ‌ల్య పుర‌స్కారం అంద‌జేసింది. భార‌త‌దేశం నుండి మొట్ట‌మొద‌టిగా ఈ అవార్డు అందుకున్న ఘ‌న‌త రాజేంద్రుడికే ద‌క్కింది. సిడ్ని పార్లమెంటు హాలులో జరిగిన కార్యక్రమంలో ఆస్ట్రేలియా కల్చరల్ మినిస్టర్, ఏడుగురు ఎంపీలు రాజేంద్ర ప్రసాద్‌ని ఘనంగా సన్మానించి ఈ అవార్డు ప్రదానం చేశారు. రెండు నెలల క్రితం న్యూజెర్సీ అసెంబ్లీ కూడా రాజేంద్రప్రసాద్‌ను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించగా, ఇప్పుడు ఆయ‌న ఖాతాలో మరో జీవిత సాఫ‌ల్య పుర‌స్కారం చేర‌డం అభినంద‌నీయం.
1572
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology