రాజ్‌దూత్ టీజ‌ర్ విడుద‌ల‌

Sat,June 8, 2019 07:35 AM
RajDooth Movie Teaser released

రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి మేఘాంశ్ హీరోగా రాజ్‌దూత్ అనే సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై సత్తి బాబు నిర్మిస్తున్న ఈ మూవీని, కార్తీక్, అర్జున్ అనే ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ తెర‌కెక్కిస్తున్నారు . రొమాంటిక్ యూత్‌ఫుల్‌ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మేఘంష్ మాస్ రోల్ లో కనిపించనున్నాడు. ఇక క‌థానాయిక‌గా రాజ‌శేఖ‌ర్ త‌న‌య శివాత్మిక న‌టిస్తుంది. రీసెంట్‌గా చిత్ర టీజ‌ర్‌ని జీవిత చేతుల మీదుగా విడుద‌ల చేశారు. ఇందులో ప్ర‌ధాన పాత్ర ధారులు ఇద్ద‌రు ఆక‌ట్టుకున్నారు. కొత్త వాళ్ళు అయిన‌ప్ప‌టికి ఎంతో న‌ట‌నా ప్ర‌తిభ‌ని క‌న‌బ‌ర్చారు. ఈ కార్య‌క్ర‌మానికి హాజరైన డిస్కోశాంతి త‌న కొడుకు తండ్రి పేరు నిల‌బెడ‌తాడ‌ని చెప్పుకొచ్చారు. అతి త్వ‌ర‌లోనే చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేలా టీం ఏర్పాట్లు చేస్తుంది.

984
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles