బాల‌కృష్ణ, రాజ‌శేఖ‌ర్ కాంబినేషన్‌లో విక్ర‌మ్ వేద రీమేక్..!

Fri,March 22, 2019 01:51 PM
rajasekharand balakrishna plays key role in vikram vedha

మాధవన్, విజయ్ సేతుపతి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తమిళ చిత్రం విక్రమ్ వేద. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా ఇద్దరు నటులకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారని ఎప్ప‌టి నుండో వార్త‌లు వ‌స్తున్నాయి. మొద‌ట ఇందులో నాగార్జున, వెంకటేష్, రానా, మాధవన్‌లలో ఎవరైనా ఇద్దరు నటించవచ్చని వార్తలు వచ్చాయి. ఆ త‌ర్వాత రీమేక్ చిత్రంలో విజ‌య్ సేతుపతి పాత్రలో రవితేజ, మాధవన్ పాత్రలో రానాలు నటిస్తారని అన్నారు. తాజాగా బాల‌కృష్ణ‌, రాజ‌శేఖ‌ర్ పేర్లు ఫ్రేంలోకి వ‌చ్చాయి.

పుష్క‌ర్ గాయ‌త్రి తెర‌కెక్కించిన విక్ర‌మ్ వేద‌ చిత్రం ఓ పోలీస్ ఆఫీస‌ర్.. వీధిరౌడీ మ‌ధ్య జ‌రిగే పోరాటం నేప‌థ్యంలో తెర‌కెక్కింది. ఇందులో మాధ‌వ‌న్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించ‌గా, విజ‌య్ సేతుప‌తి ప్రతినాయకుడిగా నటించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. 2017 జులైలో విడుదలైన ఈ చిత్రం రూ.11 కోట్ల బడ్జెట్‌తో నిర్మితం కాగా, రూ.64 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఐఎండీబీ (ఇంటర్నెట్ మేనేజ్మెంట్ డాటాబేస్)లో 2017 సంవత్సరానికి గాను మొదటి స్థానంలో నిలిచి ‘బాహుబలి 2’ చిత్రాన్ని వెనక్కినెట్టింది.

బాలకృష్ణ‌, రాజ‌శేఖ‌ర్‌లు విక్ర‌మ్ వేద చిత్ర రీమేక్‌లో నటించ‌నున్నార‌నే ప్ర‌చారం జ‌ర‌గుతుండ‌గా, ఇందులో బాల‌య్య గ్యాంగ్ స్ట‌ర్‌గా, రాజ‌శేఖర్ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ని తెలుస్తుంది. రాజ‌శేఖ‌ర్ ఇప్ప‌టికే ఎన్నో పోలీస్ పాత్ర‌లు పోషించ‌గా, ఈ చిత్రంలోను పోలీస్ ఆఫీస‌ర్‌గా మెప్పిస్తాడ‌ని అంటున్నారు. బాల‌య్య ప్ర‌స్తుతం ఎల‌క్ష‌న్స్ ప్ర‌చారంలో బిజీగా ఉండ‌గా, రాజ‌శేఖ‌ర్ క‌ల్కి అనే చిత్ర షూటింగ్‌లో ఉన్నాడు. వారి వారి బిజి షెడ్యూల్స్ ముగిసాక విక్ర‌మ్ వేద రీమేక్ చిత్రం ప‌ట్టాలెక్కే అవ‌కాశం కనిపిస్తుంది.

2591
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles