రాజ‌మౌళి త‌న‌యుడు మూవీలో విల‌న్‌గా..!

Sun,December 16, 2018 07:41 AM
rajasekhar son movie goes on to the floors very soon

రాజమౌళి కుమారుడు కార్తికేయ బాహుబలి చిత్రానికి దర్శకత్వం విభాగంలో పనిచేసిన సంగ‌తి తెలిసిందే . ఆయన బాహుబలి సెకండ్ యూనిట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ప్ర‌స్తుతం తన సొంత బ్యానర్ పై ఒక సినిమాను నిర్మిస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందే ఈ సినిమాకి 'ఆకాశవాణి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. అశ్విన్ గంగరాజు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, కీర‌వాణి త‌న‌యుడు కాల‌భైర‌వ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ జ‌న‌వ‌రి నుండి రెగ్యుల‌ర్‌గా జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తుండ‌గా, ఇందులో విల‌న్ పాత్ర కోసం సూప‌ర్ స్టార్స్‌ని ఎంపిక చేయాల‌ని యూనిట్‌ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. చిత్రంలో విల‌న్ పాత్ర చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉండ‌నుండ‌డంతో ఆ పాత్ర కోసం మ‌ల‌యాళ మెగాస్టార్ మోహ‌న్‌లాల్‌ని సంప్ర‌దించాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఒక‌వేళ ఆయ‌న‌కి డేట్స్ ఇబ్బంది ఏర్ప‌డితే యాంగ్రీయంగ్ మెన్ రాజ‌శేఖ‌ర్‌ని విల‌న్‌గా ఒప్పించాల‌ని చిత్ర బృందం భావిస్తుంద‌ట‌. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి ఓ క్లారిటీ రానుంది.

3458
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles