ప్రీలుక్‌తో మెగాస్టార్‌కి విషెస్ తెలిపిన రాజ‌శేఖ‌ర్‌

Wed,August 22, 2018 11:51 AM
Rajasekhar  new movie pre look released

మెగాస్టార్ చిరంజీవికి ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు వెల్లువ‌లా కురిపిస్తున్నారు. ఎవ‌రికి వారు త‌మ‌దైన స్టైల్‌లో చిరుపై త‌మ‌కి ఉన్న ప్రేమ‌ని తెలియ‌జేస్తున్నారు. యాంగ్రీ యంగ్ మెన్ రాజ‌శేఖ‌ర్ త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా చిరుకి ప్రీ లుక్ పోస్ట‌ర్‌తో బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. గ‌రుడ‌వేగ చిత్రంతో మంచి విజ‌యం అందుకున్న రాజ‌శేఖ‌ర్ చాలా గ్యాప్ త‌ర్వాత ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఇది 1983 బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియడ్ చిత్రం కాగా, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ క‌థాంశంతో సినిమా తెర‌కెక్కనుంది. తాజాగా విడుద‌లైన చిత్ర ప్రీ లుక్ అభిమానుల‌లో ఆస‌క్తిని క‌లిగిస్తుంది.

ప్రీ లుక్ పోస్ట‌ర్‌లో 1983లో క‌పిల్ దేవ్ వ‌ర‌ల్డ్ అందుకున్న ఫోటోతో పాటు అదే సంవ‌త్స‌రంలో విడుద‌లైన ఖైదీ మూవీ పోస్ట‌ర్ క‌నిపిస్తుంది. చిత్రంలో రాజ‌శేఖర్ కొత్త అవ‌తారంలో క‌నిపించ‌నున్నార‌ని ప్రీ లుక్ ద్వారా తెలియ‌జేసిన టీం మూవీ టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని రాఖీ పౌర్ణ‌మి సంద‌ర్బంగా ఆగ‌స్ట్ 26న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలిపారు. అ! లాంటి విభిన్న చిత్రాన్ని తెర‌కెక్కించిన ప్ర‌శాంత్ వ‌ర్మ త‌న తాజా చిత్రం ప్రీ లుక్‌తోనే అభిమానుల‌లో భారీ అంచ‌నాలు పెంచాడు. మ‌రి రాజ‌శేఖ‌ర్- ప్ర‌శాంత్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న ఈ చిత్రం ఎలాంటి విజ‌యం సాధిస్తుందో చూడాలి. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రంకి క‌ల్కి అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్నార‌ట‌.


3681
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles