షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ సీనియ‌ర్ హీరో..!

Sun,November 18, 2018 07:41 AM
rajasekhar injured in shooting

గ‌రుడ వేగ చిత్రంతో ఫాంలోకి వచ్చిన సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ అ మూవీ ఫేం ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో క‌ల్కి అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది 1983 బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియడ్ చిత్రం కాగా, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ క‌థాంశంతో సినిమా తెర‌కెక్కనుంది. ఈ చిత్రాన్ని శివానీ శివాత్మిక మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్పణ‌లో హ్యాపీ మూవీస్ ప‌తాకంపై రూపొందిస్తుండ‌గా.. సి.క‌ళ్యాణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇందులో ముగ్గురు క‌థానాయిక‌ల‌ని ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది. అందులో ఒక‌రు హార్ట్ ఎటాక్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అదా శ‌ర్మ కాగా, మ‌రొక‌రు బాహుబ‌లి-ది బిగినింగ్‌లో స్పెష‌ల్ సాంగ్‌లో అందాలు ఆర‌బోసిన స్కార్‌లెట్ విల్స‌న్, ఎక్క‌డ‌కి పోతావు చిన్న‌వాడ ఫేం నందిత శ్వేత‌.

ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ రెండు కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో వేసిన‌ భారీ సెట్ లో రూపొందుతుంది. ఈ సెట్ లో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఆ సన్నివేశాల్లో రాజశేఖర్ డూప్ లేకుండా రిస్క్ చేసి మరి.. ఫైట్స్, జంప్స్ వంటి రిస్కీ షాట్స్ చేస్తున్నట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. చిత్ర యూనిట్ వ‌ద్ద‌ని చెప్పిన కూడా రియాలిటీ కోసం తానే ఆ స్టంట్స్ చేస్తాన‌ని రాజ‌శేఖ‌ర్ అన్నట్టు కూడా ప్ర‌చారం జ‌రిగింది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం రాజశేఖర్ ఆ యాక్షన్ సీక్వెన్స్ లో నటిస్తుండగా భుజానికి గాయం అయిందట. అయినా గాయాన్ని లెక్క చేయ‌ని రాజశేఖర్ షూటింగ్ కంప్లీట్ చేసి.. ఆ తరువాత హాస్పిటల్ కు వెళ్లినట్లు చిత్రబృందం ద్వారా తెలుస్తోంది. మ‌రి రాజ‌శేఖ‌ర్ ప‌డుతున్న క‌ష్టానికి ఎంత ప్ర‌తిఫ‌లం ల‌భిస్తుందో చూడాలి.

3526
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles