ఎన్టీఆర్ నుండి మ‌రో సాంగ్ విడుద‌ల‌

Wed,December 12, 2018 10:47 AM
Rajarshi Full Song With Lyrics

దివంగ‌త న‌టుడు స్వ‌ర్గీయ ఎన్టీరామారావు జీవిత నేప‌థ్యంలో ఎన్టీఆర్ బ‌యోపిక్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ త‌న‌యుడు బాల‌య్య స్వ‌యంగా నిర్మిస్తుండ‌గా సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వ‌చ్చే ఏడాది జనవరి 9న ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’, జనవరి 24న ‘యన్.టి.ఆర్- మహానాయకుడు’గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు చిత్రానికి సంబంధించి ప‌లు పోస్ట‌ర్స్ విడుద‌ల కాగా, ఇవి సినిమాపై అంచ‌నాలు పెంచాయి. ఇటీవ‌ల‌ ఎన్టీఆర్ సినిమా నుండి క‌థానాయ‌క అంటూ సాడే పాట విడుద‌ల చేశారు. రచయితలు శివ శక్తిదత్తా, కే రామకృష్ణలు పూర్తి సంస్కృత పదాలతో గంభీరమైన పాటను రచించారు. కీరవాణి సంగీత సారధ్యంలో బాలీవుడ్ గాయకుడు కైలాష్ ఖేర్‌ ఈ గీతాన్ని ఆలపించారు. ఈ పాట అభిమానుల‌ని ఎంత‌గానో అలంచింది.

తాజాగా రాజ‌ర్షి అనే సాంగ్ విడుద‌ల చేశారు. ఈ పాట‌కి శివ‌ద‌త్తా, కె రామ‌కృష్ణ‌, కీర‌వాణి లిరిక్స్ అందించ‌గా.. శ‌ర‌త్ సంతోష్‌, మోహ‌న భోగ‌రాజు, కీర‌వాణి, క‌ళా భైర‌వ‌, శ్రీనిధి తిరుమల క‌లిసి ఆల‌పించారు. ఈ సాంగ్ కూడా అల‌రిస్తుంది.ఈ చిత్రంలో ఎన్టీఆర్ భార్య బ‌స‌వ‌తారకం పాత్ర‌లో విద్యా బాల‌న్ న‌టించ‌గా, చంద్ర బాబు పాత్ర‌లో రానా న‌టించారు. ఇక ముఖ్య పాత్ర‌ల‌లోను ప‌లువురు సీనియ‌ర్ స్టార్స్ న‌టించారు. కీర‌వాణి చిత్రానికి అంద‌మైన స్వ‌రాలు స‌మకూరుస్తున్న సంగ‌తి తెలిసిందే.

1973
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles