రాజ్‌తరుణ్‌ మద్యం తాగి కారు నడుపలేదు: రాజారవీంద్ర

Fri,August 23, 2019 07:41 AM
rajaraveendra clarifies about rajtarun accident

హైదరాబాద్ : సినీ నటుడు రాజ్‌తరుణ్‌ మద్యం తాగి నడుపలేదని సినీ ఆర్టిస్టు రాజారవీంద్ర తెలిపారు. ఇప్పటికే ట్విట్టర్‌లో రాజ్‌తరుణ్‌ అతివేగంతో వస్తుండగా అల్కాపూర్‌ టౌన్‌షిప్‌ మలుపు వద్ద కారు కంట్రోల్‌ కాకపోవడంతో గోడకు ఢీకొట్టి గాయాలయ్యాయనే భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయానని వివరించారు. రాజ్‌తరుణ్‌ డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌ చేయడం వల్లే ఈ ఘటన జరిగిందన్న దానికి సంబంధించి వీడియోలు, వాయిస్‌ రికార్డింగ్‌లు తన దగ్గర ఉన్నాయని తెలిసి వాటిని తొలిగిస్తే నగదు ఇస్తానని రాజ్‌తరుణ్‌ బతిమిలాడాడని కాస్ట్యూమ్‌ డిజైనర్‌ కార్తీక్‌ మీడియా ముందుకు వచ్చాడు. దీనిపై సినీ ఆర్టిస్టు రాజారవీంద్ర స్పందించారు. కార్తీక్‌ చెబుతున్నది అబద్ధమని, అది వాస్తవం కాదని కొట్టిపారేశాడు. అతను తన దగ్గర ఘటన జరిగినప్పుడు రాజ్‌తరుణ్‌కు సంబంధించి ఆధారాలు ఉన్నాయని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని రాజారవీంద్ర ఆరోపించారు.

చివరకు రూ.3లక్షలు ఇవ్వాలని, లేదంటే మీడియా ముందుకు వెళ్తానని బెదిరించాడని రాజారవీంద్ర తెలిపారు. ఈ కేసులో పోలీసు విచారణకు పూర్తిగా సహకరిస్తామని, రెండురోజుల్లో రాజ్‌తరుణ్‌ షూటింగ్‌కు వస్తాడని వివరించారు. రాజ్‌తరుణ్‌పై చేస్తున్న ఆరోపణలపై న్యాయపోరాటం చేస్తామని రాజారవీంద్ర స్పష్టం చేశారు. కార్తీక్‌ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు రాజారవీంద్ర చెప్పారు.

రాజ్‌తరుణ్‌ చేసిన రోడ్డు ప్రమాద ఘటనపై నార్సింగి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసులు కార్తీక్‌ దగ్గర ఉన్న ఆడియో, వీడియోలను పరిశీలించనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత కేసులో సెక్షన్‌లు కూడా మారే అవకాశం ఉండడంతో పాటు రాజ్‌తరుణ్‌ నుంచి సేకరించే స్టేట్‌మెంట్‌ కీలకంగా మారనున్నది. కాగా,తనను కార్తీక్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని ఆయనపై చర్య లు తీసుకోవాలని రాజ్‌తరుణ్‌ గురువారం మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

2594
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles