జ‌పాన్ అభిమానుల‌కి ర‌జనీకాంత్ స్పెష‌ల్ మెసేజ్

Thu,November 22, 2018 01:42 PM
rajanikanth  Special Message To His Fans In Japan

ర‌జ‌నీకాంత్‌, మీనా ప్రధాన పాత్ర‌ల‌లో కె. ఎస్. రవికుమార్ తెర‌కెక్కించిన చిత్రం ముత్తు. 1995 లో విడుదలైన ఈ చిత్రం మ‌ల‌యాళంలో ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన తెన్మవిన్ కొంబత్ అనే సినిమాకి రీమేక్. అక్టోబరు 23, 1995 న విడుదలైన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొంది భారీ వసూళ్ళు రాబట్టింది. తమిళనాడులోని కొన్ని థియేటర్లలో 175 రోజులు ఆడింది. 1998 లో జపనీస్ భాషలో విడుదలై రజనీకాంత్ కు జపాన్ లో కూడా అభిమానుల్ని సంపాదించిపెట్టింది. ఈ సినిమాకు ఎ. ఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వం వహించాడు. ముత్తు చిత్రం జ‌పాన్‌లో విడుద‌లై 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా, ఈ చిత్రాన్ని 4కే డిజిట‌ల్ క్వాలిటీతో 5.1 స‌రౌండ్ సౌండ్ ఎక్స్ పీరియెన్స్ ఫీలింగ్ వ‌చ్చేలా టోక్యో, జ‌పాన్‌ల‌లో 25 స్క్రీన్స్‌లో నవంబ‌ర్ 23న విడుద‌ల చేయ‌నున్నారు.

జ‌పాన్‌లో ముత్తు చిత్రం విడుద‌ల కానున్న సంద‌ర్భంగా త‌లైవ‌ర్ అభిమానుల‌ని ఉద్దేశించి స్పెష‌ల్ నోట్ రాశారు. నాపై మీరు చూపిస్తున్న ఆద‌ర‌ణ‌, ప్రేమ‌కి ధ‌న్య‌వాదాలు. కొత్త టెక్నాల‌జీతో, మెరుగైన నాణ్య‌త‌తో మ‌రోసారి మీ ముందుకు వ‌స్తున్న ముత్తు చిత్రాన్ని త‌ప్ప‌క ఆద‌రిస్తార‌ని నేను న‌మ్ముతున్నాను అని ర‌జ‌నీ నోట్‌లో పేర్కొన్నారు. ముత్తు త‌ర్వాత ర‌జనీకాంత్‌కి జ‌పాన్‌లో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెర‌గ‌గా, ఆయ‌న ప్ర‌తి సినిమా ఇప్పుడు జ‌పాన్‌లో విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టించిన 2.0 చిత్రం న‌వంబ‌ర్ 29న విడుద‌ల‌య్యేందుకు సిద్ధ‌మైంది. ర‌జ‌నీకాంత్ ప్ర‌స్తుతం పేటా అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంది.

1363
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles