HomeLATEST NEWSrajanikanth meets kamal haasan

క‌మ‌ల్‌హాస‌న్‌ని క‌లిసి ఆప్యాయంగా ప‌ల‌క‌రించిన ర‌జ‌నీ

Published: Fri,February 8, 2019 08:16 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   
బాల‌చంద‌ర్ శిష్యులు క‌మ‌ల్ హాస‌న్‌, ర‌జ‌నీకాంత్‌లకి త‌మిళ సినీ పరిశ్ర‌మతో పాటు దేశ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. వారి సినిమాల‌కి ఎంత‌టి ఆద‌ర‌ణ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. క‌మ‌ల్‌, ర‌జ‌నీకాంత్ ఒకే ఫ్రేమ్‌లో క‌నిపించారంటే అభిమానుల ఆనందానికి హ‌ద్దులు ఉండ‌వు. ఇటీవ‌ల క‌మ‌ల్‌, ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల‌లోకి రావ‌డంతో వీరు క‌లిసిన ప్ర‌తి సారి జోరుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అయితే తలైవా రీసెంట్‌గా క‌మ‌ల్ హాస‌న్ ఇంటికి వెళ్లి ఆయ‌నని ప్రేమ‌గా ప‌ల‌క‌రించారు. త‌న కూతురి వివాహ వేడుక‌కి త‌ప్ప‌క హాజ‌రు కావాలంటూ శుభ‌లేఖ‌ని అందించారు. అయితే ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్ చాలా రోజుల త‌ర్వాత ఇలా ఒకే ఫ్రేములో క‌నిపించే స‌రికి ఆ ఫోటోలని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు నెటిజ‌న్స్‌. సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ చిన్న‌ కుమార్తె సౌంద‌ర్య వివాహం నటుడు, వాణిజ్యవేత్త విశ్వగణ్ వనంగమూడిని ఫిబ్ర‌వ‌రి 11న ఘ‌నంగా జ‌ర‌గనున్న సంగ‌తి తెలిసిందే . ఈ నేప‌థ్యంలో ర‌జ‌నీకాంత్ స్వ‌యంగా సినీ ప్ర‌ముఖుల ఇళ్ళ‌కి వెళ్లి వారిని ఆహ్వానిస్తున్నాడు.


1558
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology