5 మిలియ‌న్ మార్క్ చేరుకున్న ర‌జ‌నీకాంత్‌

Sat,November 17, 2018 08:18 AM
rajanikanth followers rech 5 million mark

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దేశ‌, విదేశాల‌లో ఆయ‌న‌కి లెక్క‌కి మించిన ఫాలోవ‌ర్స్ ఉన్నారు. నవంబ‌ర్ 29న 2.0 చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న త‌లైవా స‌రికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉండే ర‌జ‌నీకాంత్ ఫాలోవ‌ర్స్ సంఖ్య 5 మిలియ‌న్ మార్క్‌కి చేరింది. దీంతో ఆయ‌న అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. త్వ‌ర‌లో రాజకీయారంగేట్రం చేయ‌నున్న ర‌జ‌నీ మ‌రింత ఫాలోవర్స్‌ని పెంచుకోవ‌డం ఖాయం అని విశ్లేష‌కులు అంటున్నారు. 2013, ఫిబ్ర‌వ‌రిలో ర‌జ‌నీ ట్విట్ట‌ర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం పేటా అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు ర‌జ‌నీకాంత్‌. కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతుంది. ఇదిలా ఉంటే దక్షిణాదిలో నటులు ధనుష్, అల్లు అర్జున్, మ‌హేష్ బాబు అత్యధిక సంఖ్యలో సోషల్ మీడియా ఫాలోవర్లను కలిగి ఉన్నారు.

1988
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles