కాలా ఆడియో వేడుక‌లో ర‌జ‌నీ కీల‌క ప్ర‌క‌ట‌న‌..!

Sun,May 6, 2018 07:52 AM
rajanikanth announces his party name in kaala audio function

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాల కన్నా ఆయన పొలిటికల్ ఎంట్రీపై ఇప్పుడు అందరిలో ఉత్కంఠ నెలకొంది. జయలలిత మరణం తర్వాత కోలీవుడ్ స్టార్ హీరోలు కమల్ హాసన్, రజనీకాంత్ తమిళ రాజకీయాలలో కీలకంగా మారారనే టాక్స్ కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే కమల్ త‌న‌ పార్టీ పేరు ఎజెండా ప్ర‌క‌టించ‌గా, ర‌జ‌నీకాంత్ త‌న పార్టీ వివ‌రాలు ఎప్పుడు ప్ర‌క‌టిస్తాడా అని అంద‌రిలో ఉత్కంఠ నెల‌కొంది. ర‌జ‌నీకాంత్‌ ఇప్ప‌టికే త‌న పార్టీ నిర్మాణాన్ని పూర్తిగా సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తుండ‌గా మే 9న జ‌ర‌గ‌నున్న కాలా ఆడియో వేడుక‌లో రాజ‌కీయ పార్టీకి సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్నాడని కోలీవుడ్ టాక్. త‌లైవా త‌న పార్టీకి ‘రజినీకాంత్ మక్కల్ మంద్రమ్’ అనే పేరుని పెట్ట‌బోతున్నార‌ని కోలీవుడ్‌లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. 234 స్థానాల్లో త‌న‌ పార్టీ అభ్యర్థులను బ‌రిలో దింప‌నున్నట్టు గ‌తంలోనే ప్ర‌క‌టించారు సూప‌ర్ స్టార్ . పార్టీ నిర్మాణం రూపొందించే పూర్తి బాధ్య‌త‌ని లైకా ప్రొడక్షన్స్ మాజీ అధినేత రాజు మహలింగం మరియు అభిమానుల సంఘం నాయకుడు సుధాకర్‌కి ర‌జ‌నీకాంత్‌ అప్ప‌గించిన‌ట్టు తెలుస్తుంది.ర‌జ‌నీకాంత్ న‌టించిన కాలా చిత్రం పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా ఈ మూవీని వండ‌ర్ బార్ బేన‌ర్‌పై ధ‌నుష్ నిర్మించాడు.

2052
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles