త‌మ హీరో గ్రేట్ అంటూ క‌త్తుల‌తో పొడుచుకున్న అభిమానులు

Thu,January 10, 2019 11:44 AM
rajanikanth and ajith fans fight at kollywood

ఒక్కోసారి అభిమానుల వింత ప్ర‌వ‌ర్త‌న హీరోల‌కి లేనిపోని స‌మ‌స్య‌లు తెచ్చిపెడుతున్నాయి. మంగ‌ళ‌వారం య‌శ్‌ని క‌లిసేందుకు సెక్యూరిటీ అనుమ‌తించ‌క‌పోవడంతో ర‌వి అనే అభిమాని పెట్రోల్ పోసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ సంఘ‌ట‌న నుండి తేరుకోక‌ముందే కోలీవుడ్‌లో ర‌జ‌నీకాంత్‌, అజిత్ అభిమానులు క‌త్తుల‌తో పొడుచుకోవ‌డం హాట్ టాపిక్‌గా మారింది. ర‌జ‌నీకాంత్ న‌టించిన పేటా చిత్రం, అజిత్ ద్విపాత్రాబిన‌యంలో తెర‌కెక్కిన విశ్వాసం చిత్రాలు నేడు గ్రాండ్‌గా విడుద‌లయ్యాయి. ఇద్ద‌రు స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు విడుద‌ల కావ‌డంతో థియేట‌ర్స్ ద‌గ్గ‌ర హంగామా ఓ రేంజ్‌లో నెల‌కొంది. త‌మ హీరో గొప్ప అంటే త‌మ హీరో గొప్ప అంటూ కొన్ని చోట్ల ఫ్యాన్స్ ఘ‌ర్ష‌ణ‌ల‌కి దిగారు. వేలూరులోని ఓ థియేటర్‌ ముందు ఇరువర్గాల అభిమానులు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ సంఘటనలో గాయపడిన నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన పేటా, విశ్వాసం చిత్రాల‌కి పాజిటివ్ టాక్ వ‌స్తుండ‌డంతో అభిమానుల‌లో ఆనందోత్సాహాలు నెల‌కొన్నాయి.

2915
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles