అమెరికాలో ర‌జ‌నీకాంత్ .. కార‌ణం ?

Tue,April 24, 2018 08:10 AM
rajani went to us for medical check up

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవ‌ల హిమాల‌యాల‌కి వెళ్ళిన సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజులు సిమ్లా, రిషికేష్, ధర్మశాల త‌దిత‌ర ప్రాంతాలు సంద‌ర్శించి ఆ త‌ర్వాత చెన్నై చేరుకున్నారు. కొద్ది గ్యాప్ తీసుకున్న ర‌జ‌నీ వెంట‌నే అమెరికా వెళ్ళార‌ట‌. ఆయ‌న‌ ప్ర‌స్తుతం అమెరికాలో ఉన్న‌ట్టు తెలుస్తుంది. రెగ్యుల‌ర్ హెల్త్ చెక‌ప్ కోసం ర‌జ‌నీ త‌న పెద్ద కూతురు ఐశ్వ‌ర్య‌తో అమెరికా వెళ్ళార‌ని అంటున్నారు. మే రెండో వారం వ‌ర‌కు త‌లైవా అమెరికాలోనే ఉంటార‌ని టాక్. యూఎస్ నుండి వ‌చ్చిన త‌ర్వాత కాలా చిత్ర ప్ర‌మోష‌న్‌లో పాల్గొన‌డంతో పాటు త‌న పార్టీకి సంబంధించిన ప‌నులు వేగవంతం చేయ‌నున్నారు. ర‌జ‌నీ న‌టించిన కాలా చిత్రం జూన్ 7న విడుద‌ల కానుండ‌గా, రోబో రిలీజ్ డేట్‌పై ఇంకా క్లారిటీ లేదు. ఇక వచ్చే ఎన్నికల్లో 234 స్థానాల్లో తమ పార్టీ తరుపున అభ్యర్థులు బరిలో నిలుస్తున్నట్లు గ‌త ఏడాది డిసెంబ‌ర్ 31న ప్ర‌క‌టించిన‌ ర‌జ‌నీకాంత్ త‌న పార్టీకి ‘రజినీకాంత్ మక్కల్ మంద్రమ్’ అనే పేరుని పెట్ట‌బోతున్నార‌ని కోలీవుడ్‌లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది.

2185
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS