ఆ ముగ్గురు ఇండియ‌న్ సినిమా జెమ్స్: ర‌జ‌నీకాంత్‌

Sat,November 3, 2018 01:23 PM
rajani praise three directors

చెన్నైలోని సత్యం సినిమాస్‌లో 2.0 చిత్ర ట్రైల‌ర్ కార్య‌క్ర‌మాన్ని అట్ట‌హాసంగా నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. కార్య‌క్ర‌మానికి ర‌జనీకాంత్‌, అక్ష‌య్ కుమార్, శంక‌ర్, రెహ‌మాన్, అమీజాక్స‌న్ త‌దిత‌ర‌లు హాజ‌ర‌య్యారు. 4డీ సౌండ్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, థియేటర్లలో సీటు కింద స్పీకర్‌ ఉన్న భావన ప్రేక్షకుడికి కలుగుతుందని ద‌ర్శ‌కుడు అన్నారు. సౌండ్‌ డిజైనర్‌ రసూల్‌ పూకుట్టి సహాయంతో త‌న క‌ల‌ నిజమైందని ఆనందం వ్యక్తం చేశారు శంక‌ర్. ఇక ర‌జ‌నీకాంత్ మాట్లాడుతూ.. 600 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ అవుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.


ఈ చిత్రం రూపొంద‌డానికి కార‌ణం నిర్మాత సుభ‌స్క‌ర‌న్‌. ఆయ‌న వ‌లనే ఈ విజువ‌ల్ వండ‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. 2.0 చిత్రం స‌క్సెస్ అయిందంటే అందుకు కార‌ణం ర‌జ‌నీకాంత్ కాదు. ఆ క్రెడిట్ అంతా శంక‌ర్‌కే ద‌క్కుతుంది. లేట్ అయిన లేటెస్ట్‌గా వ‌స్తున్నాము. శంక‌ర్ ఇండియన్ సినిమాకి జెమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్ బ‌ర్గ్ లాంటివాడు . మ‌న ఇండియ‌న్ సినిమా ఆణిముత్యాలు శంక‌ర్‌, రాజ‌మౌళి, రాజకుమార్ హిరాణీ. చిత్రం ప్రేక్ష‌కుల‌కి మంచి థ్రిల్‌ని క‌లిగిస్తుంద‌ని ర‌జ‌నీకాంత్ తెలిపారు.


అక్ష‌య్ మాట్లాడుతూ.. సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో అనేక స‌వాళ్లు ఎదుర్కొన్నాను. 28 ఏళ్ల కెరీర్‌లో వేసుకున్న మేక‌ప్ ఈ ఒక్క‌ సినిమా కోసం వేసుకున్నాను. మేక‌ప్ వేసుకున్న త‌ర్వాత నా పాత్ర చూసి షాక్ అయ్యాను. మేక‌ప్ వేసుకోవ‌డానికి మూడు గంట‌లు ప‌డితే, తీయ‌డానికి గంట‌న్న‌ర స‌మ‌యం ప‌ట్టేద‌ని అక్ష‌య్ పేర్కోన్నాడు. శంక‌ర్ ద‌ర్శ‌కుడు మాత్ర‌మే కాదు శాస్త్ర‌వేత్త కూడా . ఆయ‌న నుండి చాలా నేర్చుకున్నాను అని తెలిపారు. విజువ‌ల్ వండ‌ర్‌లా తెర‌కెక్కిన ఈ చిత్రం న‌వంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.3044
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles