న‌య‌న‌తార‌పై సూప‌ర్ స్టార్ ప్ర‌శంస‌ల జ‌ల్లు

Tue,November 14, 2017 04:44 PM
rajani praise nayanthara

లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌పై సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. న‌య‌న న‌టించిన చిత్రం అర‌మ్ రీసెంట్‌గా విడుద‌ల కాగా, సోమవారం ర‌జ‌నీకాంత్ కోసం స్పెష‌ల్ స్క్రీనింగ్ వేశారు. మూవీ చూసిన త‌ర్వాత ర‌జ‌నీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. సినిమా నా హృద‌యానికి చాలా ద‌గ్గ‌రైంది. న‌య‌న‌తార క‌లెక్ట‌ర్ పాత్ర‌లో అద్భుతంగా నటించింది. చిత్ర బృందానికి నా శుభాకాంక్ష‌లు అని అన్నారు. ర‌జ‌నీకాంత్ ప్ర‌శంస‌లు మాకు చాలా బూస్ట‌ప్‌ ఇచ్చాయ‌ని చిత్ర ద‌ర్శ‌క నిర్మాత‌లు పేర్కొన్నారు. ఆయ‌న మాట‌ల‌తో మేము మ‌రింత క‌ష్ట‌ప‌డి చేయాల‌నే స్పూర్తిని పొందామ‌ని వారు తెలిపారు.

అరమ్ అంటే తమిళంలో న్యాయం చేయండి .. ధర్మం చేయండి వంటి అర్థాలు వస్తాయి. గోపీ నయనార్ తెరకెక్కించిన ఈ సినిమా మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకుంది. హీరోయిన్ కు ఇంపార్టెన్స్ ఉన్న ఈ సినిమాలో, ప్రజల కష్టాలను, సమస్యలను రాజకీయ నాయకుల ముందుంచి, వారిని ప్రశ్నించే కలెక్టర్ పాత్రలో నయనతార నటించింది.

గ్రామాల్లో రక్షిత మంచినీటి సదుపాయంతో పాటు కనీస వసతులు కల్పించాలని ప్రజల తరఫున నిలిచి పోరాడే పాత్రలో నయన నటన అద్భుతం అంటున్నారు. విమర్శకులు సైతం ఆమె నటనపట్ల ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా సాధించిన స‌క్సెస్‌ నయనతారకి 'లేడీ సూపర్ స్టార్ అనే బిరుదు త‌ప్ప‌క ఇస్తుంద‌ని అంటున్నారు . కథా కథనాలు .. టేకింగ్ .. నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ అని చెబుతున్నారు. త్వరలో 'కర్తవ్యం' పేరుతో ఈ సినిమా తెలుగులో విడుదల కాబోతోంది.1523
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS