ర‌జ‌నీ సినిమాతో మ‌హేష్ మ‌ల్టీ ప్లెక్స్ ప్రారంభం!

Wed,November 14, 2018 10:09 AM
rajani opens mahesh multiplex

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఒక వైపు సినిమాల‌తో బిజీగా ఉంటూనే మ‌రో వైపు బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఏషియన్ ఫిల్మ్స్ సంస్థతో కలిసి ఏఎంబీ సినిమాస్ పేరిట మహేష్ ఓ మల్టీప్లెక్స్‌ను నిర్మించ‌గా, దాదాపు ఇది పూర్తి కావొచ్చింద‌ని తెలుస్తుంది. అమితాబ్ బ‌చ్చ‌న్‌, అమీర్ ఖాన్ ప్రధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రంతోనే మ‌ల్టీ ప్లెక్స్‌ని ప్రారంభించాల‌ని అనుకున్న‌ప్ప‌టికి , నిర్మాణం పూర్తి కాక‌పోవ‌డంతో వాయిదా వేశారు. ఇక న‌వంబ‌ర్ 29న విడుద‌ల కానున్న భారీ బ‌డ్జెట్ చిత్రం 2.0 చిత్రంతో ఏఎంబీ మల్టీప్లెక్స్‌ను మహేష్ ప్రారంభించాలని అనుకుంటున్నారట . ఇది అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన మల్టీప్లెక్స్ కావటంతో ‘2.ఓ’ లాంటి 3డీ విజువల్‌, 4డీ ఆడియోతో రూపొదించిన సినిమా అభిమానుల‌కి మాంచి కిక్ ఇస్తుంద‌ని భావిస్తున్నారు. ఈ మ‌ల్టీ ప్లెక్స్ ప్రారంభానికి ర‌జ‌నీకాంత్ ముఖ్య అతిధిగా హాజ‌ర‌వుతాడ‌ని అనే టాక్ బ‌లంగా వినిపిస్తుండ‌గా, ఇదే క‌నుక నిజ‌మైతే అభిమానుల‌కి ఆ సన్నివేశం క‌నుల విందుగా మార‌డం ఖాయం అంటున్నారు. మ‌హేష్ ప్ర‌స్తుతం మ‌హర్షి అనే సినిమాతో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే.

2501
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles