అల్లుడిని అభినందించిన రజనీకాంత్

Sat,February 6, 2016 02:27 PM
rajani congratulate to danush

తమిళ స్టార్ హీరో ధనుష్ తన మామ పలుకుబడిని ఏ మాత్రం వాడకుండా వరుస సక్సెస్‌లను చవి చూస్తున్నారు. కేవలం ఒక్క జానర్‌కే కట్టుబడి ఉండకుండా వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మరింత ఆనందానికి గురయ్యేలా చేస్తున్నారు. ఇటీవల ఈ హీరో విశారణై చిత్రంలో నటించగా ఈ చిత్రంపై రజనీకాంత్, కమల్ లాంటి ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ధనుష్ సహా నిర్మాతగా, వెట్రిమారన్ నిర్మించి తెరకెక్కించిన విశారణై చిత్రాన్ని రజనీ కాంత్ స్పెషల్‌గా అభినందించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఓ ట్వీట్ చేసారు. విశారణై లాంటి సినిమాను తమిళ సినిమాలో ఇప్పటి వరకు చూడలేదని, అంతర్జాతీయ సినిమాల సరసన ఈ సినిమా కూడా చేరుతుందని రజనీ తెలిపారు. ఇంక దర్శకుడు వెట్రి మారన్, ధనుష్‌లకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు రజనీ కాంత్. అయితే ఒకవైపు హీరోగా అలరిస్తూ మరో వైపు ప్రయోగాత్మక సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తోన్న ధనుష్‌ను మనం ప్రత్యేకంగా అభినందించి తీరాల్సిందే.


2336
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles