'అర‌వింద స‌మేత‌'పై రాజ‌మౌళి కామెంట్

Sat,October 13, 2018 09:14 AM

వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతున్న క్రేజీ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి. ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో భారీ మ‌ల్టీ స్టార‌ర్ తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నాడు. తాజాగా ఆయ‌న త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ హీరోగా తెర‌కెక్కిన అర‌వింద స‌మేత చిత్రాన్ని చూశాడు. ఈ మూవీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. యుద్ధం త‌ర్వాత ఏం జ‌రుగుతుంది ? అనే పాయింట్ బేస్ చేసుకొని త్రివిక్ర‌మ్ సినిమాని చాలా అద్భుతంగా తెర‌కెక్కించాడు. నిజంగా ఇది ఆయ‌న డేరింగ్ స్టెప్. స‌న్నివేశాల‌లో తార‌క్ ప‌ర్‌ఫార్మెన్స్ ఎప్ప‌టికి గుర్తుండి పోతుంది. జ‌గ‌ప‌తి బాబు త‌న న‌ట విశ్వ‌రూపాన్ని చూపించారు. టీం అంద‌రికి నా శుభాకాంక్ష‌లు అని ట్వీట్‌లో తెలిపారు జ‌క్క‌న్న‌. అర‌వింద స‌మేత చిత్రం అక్టోబ‌ర్ 11న విడుద‌ల కాగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల‌తో పాటు చెన్నై, ఓవ‌ర్సీస్ ఇలా ప‌లు ప్రాంతాల‌లో భారీ వ‌సూళ్ల‌తో దూసుకెళుతుంది. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందించారు. ఈషా రెబ్బా, సునీల్‌, న‌వీన్ చంద్ర‌, నాగబాబు ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించారు
5814
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles