రాజ‌మౌళి త‌న‌యుడి వెడ్డింగ్ డేట్ ఫిక్స్‌ !

Fri,November 16, 2018 08:23 AM
Rajamouli Son Karthikeya Wedding date locked

ఓట‌మెరుగ‌ని విక్ర‌మార్కుడు రాజ‌మౌళి ఫ్యామిలీ అంతా బాహుబ‌లి చిత్రం కోసం ఎంత‌గా శ్ర‌మించారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. నిద్రాహారాలు మానేసి మ‌రీ క‌ష్ట‌ప‌డ్డారు. ఐదేళ్ళ‌పాటు శ్ర‌మించిన వారికి ఈ చిత్రం మంచి ఫ‌లితాన్ని ఇచ్చింది. బాహుబ‌లి చిత్రం త‌ర్వాత రాజ‌మౌళి మ‌రో భారీ ప్రాజెక్ట్‌ని చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. రామ్ చ‌ర‌ణ్‌,ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు. వ‌చ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. అయితే ఈ లోపు ఫ్యామిలీ అంతా టైంని స‌ర‌దాగా స్పెంట్ చేస్తున్నారు. ఇటీవ‌ల (సెప్టెంబ‌ర్ 5) రాజ‌మౌళి త‌న‌యుడు ఎస్.ఎస్ కార్తికేయ నిశ్చితార్ధం జ‌గ‌ప‌తి బాబు సోద‌రుడు రాం ప్ర‌సాద్ కుమార్త్ పూజా ప్ర‌సాద్‌తో జ‌ర‌గ‌గా, వారి వివాహ తేది ఫిక్స్ అయినట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

కార్తికేయ‌, పూజాల వివాహం జ‌న‌వ‌రి 5, 2019న రామానాయుడు స్టూడియాస్‌లో జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది. సాయంత్రం 6.30ని.ల‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు. ప్ర‌స్తుతం నూత‌న దంప‌తులకి సంబంధించిన ఫ్యామిలీస్ వెడ్డింగ్ ఏర్పాట్ల‌లో బిజీగా ఉన్న‌ట్టు స‌మాచారం. రాజ‌మౌళి కుటుంబ స‌భ్యులు శుభ‌లేఖ‌లు పంచే కార్య‌క్ర‌మంలో బిజీగా ఉన్న‌ట్టు టాక్‌. పూజా ప్ర‌సాద్ భ‌క్తి గీతాల‌ని ఆల‌పించే గాయ‌నిగా గుర్తింపు తెచ్చుకోగా, రాజమౌళి కుమారుడు కార్తికేయ బాహుబలి చిత్రానికి దర్శకత్వం విభాగంలో పనిచేశారు. ఆయన బాహుబలి సెకండ్ యూనిట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. త్వ‌ర‌లో ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌తిభ‌ని నిరూపించుకునేందుకు సిద్ధ‌మ‌య్యాడు. కొన్నాళ్ళ నుండి కార్తికేయ‌, పూజాలు ప్రేమ‌లో ఉండ‌గా, పెద్ద‌ల అంగీకారంతో వీరిరివురు పెళ్లి పీట‌లెక్కేందుకు సిద్ధ‌మ‌య్యారు.

2934
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles