అదే రాజమౌళి చివరి సినిమా కావొచ్చట..!

Thu,March 14, 2019 10:49 PM

బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాల తర్వాత రాజమౌళి ఏ సినిమా చేయబోతున్నారని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూశారు. బాహుబలి చిత్రం షూటింగ్ షురూ అయిన కొత్తలోనే మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్టు అని చెప్పాడు జక్కన్న. దీంతో బాహుబలి తర్వాత రాజమౌళి తీయనున్న చిత్రం ఇదేనని అంతా అనుకున్నారు. కానీ కొంత విరామం తర్వాత ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్ లో ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి పచ్చజెండా ఊపాడు.


ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు రాజమౌళి హైదరాబాద్ లో ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఓ రిపోర్టర్ బాహుబలి తర్వాత మహాభారతం సినిమా తీస్తారని ప్రచారం జరిగింది. మహాభారతం ఎప్పుడూ ప్రారంభిస్తారు. ఆ ప్రాజెక్టు ఏ దశలో ఉందని రాజమౌళిని ప్రశ్నించాడు. దీనికి జక్కన్న స్పందిస్తూ..మహాభారతం మొదలు పెడుతున్నానని నేను ఎప్పుడూ చెప్పలేదు. అది నా డ్రీమ్ ప్రాజెక్టు అని చెప్పాను. కానీ నేను తీయబోయే తర్వాత సినిమా అదే అని అంతా అనుకుంటున్నారు. ఈ విషయంపై ఎన్నిసార్లు స్పష్టత ఇచ్చినా అదే ప్రశ్న మళ్లీ అడుగుతున్నారు. మహాభారతాన్ని సిరీస్ గా తీసే ఆలోచన ఉంది. బహుశా అదే తన చివరి సినిమా అవ్వొచ్చని రాజమౌళి చెప్పారు.

4851
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles