ఒకే వేదిక‌పై చెర్రీ, ఎన్టీఆర్, రాజ‌మౌళి..!

Sun,December 9, 2018 10:32 AM
rajamouli, ram charan, jr ntr on same stage

రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో ఆర్ఆర్ఆర్( వ‌ర్కింగ్ టైటిల్) అనే క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం ఇటీవ‌ల తొలి షెడ్యూల్ పూర్తి చేసుకోగా, జ‌న‌వ‌రి నుండి మ‌రో షెడ్యూల్ జ‌రుపుకోనుంది. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. 2020 లో ఈ మూవీ విడుద‌ల కానుంది. అయితే ఈ రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ అంటే అభిమానుల‌లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. గ‌తంలో వీరు ముగ్గురు క‌లిసి దిగిన ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో ఫుల్ వైర‌ల్ అయింది.

రాజ‌మౌళి, చెర్రీ, ఎన్టీఆర్ ఒకే వేదిక పంచుకోనున్నారు అనే వార్త అంద‌రిలో ఆస‌క్తిని క‌లిగిస్తుంది. అతి త్వ‌ర‌లో చెర్రీ న‌టించిన వినయ విధేయ రామ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించాలని దర్శకనిర్మాతలు నిర్ణయించారట. అయితే ఈ ఈవెంట్ కు రాజమౌళి మరియు ఎన్టీఆర్‌ని ఆహ్వానించాలని చిత్ర బృందం భావించిన‌ట్టు తెలుస్తుంది. వినయ విధేయ రామ చిత్ర నిర్మాత దానయ్యనే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని కూడా నిర్మస్తుండడంతో ఎన్టీఆర్, రాజమౌళి ఈ ఈవెంట్ లో పాల్గొన‌డం ప‌క్కా అని అంటున్నారు. బోయ‌పాటి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ‘భరత్ అనే నేను’ ఫెమ్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ హీరో, హీరోయిన్లు ప్రశాంత్ మరియు స్నేహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు.

2499
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles