రాజమౌళి మెచ్చిన నాని మూవీ టీజర్

Fri,January 5, 2018 04:26 PM
rajamouli praises nani teaser

ఓటమెరుగని విక్రమార్కుడు అంటే దర్శక ధీరుడు రాజమౌళి ఠక్కున చెప్పేస్తారు. ఒక్క ఫ్లాప్ లేకుండా విజయ దుందుభి మోగిస్తున్నాడు. ఇక బాహుబలి సినిమాతో తెలుగోడి ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈయన ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా టాలెంట్ ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటాడు. చిన్న సినిమా అయిన అది మంచి కంటెంట్ ఉన్నది అయితే వెంటనే తన ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపిస్తాడు. తాజాగా నాని నిర్మిస్తున్న అ! చిత్ర టీజర్ అద్భుతం అని కామెంట్ పెట్టాడు రాజమౌళి.

వాల్ పోస్టర్ అనే బేనర్ పై నాని అ! అనే ప్రయోగాత్మక చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నిత్యామీనన్, కాజల్ అగర్వాల్, శ్రీనివాస్ అవసరాల, రెజీనా, ప్రియదర్శి, ఈషా రెబ్బ, మురళీశర్మ, రోహిణి, దేవదర్శిని, సుకుమారన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించి ఒక్కో పాత్ర లుక్స్ విడుదల చేస్తూ వచ్చిన నాని, నిన్న టీజర్ విడుదల చేశాడు. ఇందులో మీకొక కథ చెప్తా. అనగనగా ఓ రాజు. ఆ రాజుకి ఏడుగురు కొడుకులు. ఆ ఏడుగురూ నాలాంటి ఏడు అమాయక చేపల్ని పట్టుకున్నారు..’ అంటూ ప్రారంభమైన ‘అ!’ సినిమా టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చేప పాత్రకి నాని వాయిస్ అందించగా, చెట్టు పాత్రకి రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు.

టీజర్ లో పాత్రలతో పాటు చెట్టు, చేప మధ్య జరిగే సంభాషణలు ఎంతో కామెడీగా ఉండడంతో పాటు పాత్రలు కూడా ఎంతగానో అలరిస్తున్నాయి. ఈ క్రమంలో రాజమౌళి తన ట్విట్టర్ లో టీజర్ షేర్ చేస్తూ అ! టీజర్ ‘అ’ద్భుతం .‘ఫస్ట్ లుక్ నుంచి ఇప్పుడు విడుదలైన టీజర్ వరకు అన్ని సినిమాపై ఆసక్తి రేకిత్తిస్తున్నాయి. ‘అ’ద్భుతం..’ అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. త్వరలో ఈ దర్శకుడు చరణ్, ఎన్టీఆర్ తో కలిసి భారీ బడ్జెట్ లో మల్టీ స్టారర్ చేయనున్న సంగతి తెలిసిందే.


1958
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS