రాజ‌మౌళి ప్లానింగ్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం

Fri,December 15, 2017 10:25 AM
rajamouli planning superb

దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాతో తనలోని టాలెంట్‌ని ప్రపంచానికి పరిచయం చేశాడు. మాహిష్మతి అనే ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టంచి అందులో ఓ డ్రామాని క్రియేట్ చేశాడు. ఇది ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. అయితే రాజమౌళి వర్క్ ఏపి సీఎం నారా చంద్రబాబు నాయుడికి కూడా నచ్చడంతో అమ‌రావ‌తిలో నిర్మించే అసెంబ్లీ భ‌వనానికి జ‌క్క‌న్న సాయం తీసుకుంటుంది ఏపీ ప్ర‌భుత్వం. అయితే తానిచ్చిన ఐడియాల‌లో ఒక‌దానిని చంద్ర‌బాబు ఓకే చేశారంటూ అందుకు సంబంధించిన వీడియోని త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు రాజ‌మౌళి. 2.29 నిమిషాల నిడివి ఉన్న చిన్న వీడియోలో త‌న ఆలోచ‌న‌తో పాటు అస‌లు విష‌యాన్ని కూడా విజువ‌ల్‌గా చూపించి అందరి ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు రాజ‌మౌళి.

జ‌క్క‌న్న త‌న వీడియోలో ఈ విధంగా వివ‌రించాడు . శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో ఏడాదికి రెండుసార్లు ఉత్తరాయణం నుంచి దక్షిణాయణంలోకి మారేటప్పుడు.. మళ్లీ దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి మారేటప్పుడు తెల్లవారుజామున ఆరు గంటల వేళలో సూర్యకిరణాలు నేరుగా అరసవెల్లి స్వామి వారి మీద పడుతుంటాయి. ఈ అద్భుతాన్ని చూడటానికి ఈ రెండు కాలాల్లో భ‌క్తులు ఆలయానికి పెద్ద ఎత్తున వస్తుంటారు. ఇలాంటి చిత్రమే గుడిమల్లన్న పరశురామ టెంపుల్లో చోటు చేసుకుంటుందని.. దాన్ని స్ఫూర్తిగా చేసుకొని ఏపీ అసెంబ్లీలో ఇలాంటి విధానాన్నే అమర్చాలన్న ఐడియాను ఇచ్చిన‌ట్టు రాజ‌మౌళి తెలిపారు. ఇందుకోసం మూడు అద్దాలు.. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అవసరమని.. ఉదయం 9 గంటలకు సూర్యుడి కిరణాల్ని స్వీకరించే మొదటి అద్దం ఆ కిరణాల్ని రెండో అద్దానికి అంద‌జేస్తుంది. ప్రతి రోజు ఉదయం స‌రిగ్గా 9.15 గంటలకు రెండో అద్దం నుంచి మూడో అద్దంలోకి సూర్య కిరణాలు పడి.. అవి అసెంబ్లీ సెంటర్ హాల్లో ఏర్పాటు చేయ‌బ‌డే తెలుగు తల్లి విగ్రహం మీద పడతాయని వివ‌రించారు

తాను చెప్పిన ఐడియా ఎలా ఉంటుందో విజువల్ ఎఫెక్ట్స్ తో చూపించారు రాజ‌మౌళి. సూర్యకిరణాలు ఎప్పుడైతే తెలుగు తల్లి విగ్రహం మీద పడ్డాయో.. అప్పుడు మా తెలుగు తల్లికి మల్లెపూదండ అంటూ పాట మొదలవుతుంది. ఈ కాన్సెప్ట్ వింటుంటే ప్ర‌తి తెలుగు వాడికి రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి. ఇది చంద్ర‌బాబుకే కాదు ప‌లువురు అధికారుల‌ని కూడా విస్మ‌యానికి గురి చేసింద‌ట‌. గొప్ప కార్యంలో సాయంగా రాజ‌మౌళి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచిపోతుందని కొంద‌రు విశ్లేష‌కులు చెబుతున్నారు. మ‌రి ఆ వీడియోని మీరు చూసి ఎంజాయ్ చేయండి.

2101
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles