రాజ‌మండ్రి అభిమానుల‌తో అజిత్‌

Tue,June 19, 2018 09:38 AM
Rajahmundry fans meet with ajith

త‌మిళ స్టార్ త‌ల అజిత్‌కి త‌మిళంలోనే కాదు తెలుగు రాష్ట్రాల‌లోను ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయ‌న సినిమా కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు, చివ‌రిగా వివేగం అనే చిత్రంతో ప‌ల‌క‌రించిన అజిత్ త్వ‌ర‌లో విశ్వాసం మూవీతో అల‌రించ‌నున్నాడు. అజిత్‌తో వీరం, వేదాళం, వివేగం సినిమాల‌ని తెర‌కెక్కించిన శివ విశ్వాసం సినిమాని కూడా తెర‌కెక్కిస్తున్నాడు. . చిత్రంలో అజిత్ ఓ డాన్‌గా క‌నిపించ‌నుండ‌గా, తొలిసారి ఈ సినిమా కోసం చెన్నై త‌మిళ స్లాంగ్‌లో అజిత్ డైలాగులు చెబుతాడ‌ని స‌మాచారం. విశ్వాసం సినిమా అభిమానుల అంచ‌నాలు మించేలా , చ‌రిత్రలు తిర‌గరాసేలా తెర‌కెక్క‌నుంద‌ని కోలీవుడ్ టాక్ .

విశ్వాసం చిత్రంలో అజిత్ స‌ర‌స‌న లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తుంది. గ‌తంలో అజిత్‌తో క‌లిసి తొలిసారిగా ఏగ‌న్ అనే చిత్రం చేసింది న‌య‌న‌తార . ఆ త‌ర్వాత‌ బిల్లా, ఆరంభం అనే చిత్రాల‌లో క‌లిసి న‌టించారు. ఇప్పుడు విశ్వాసం చిత్రంతో నాలుగో సారి జ‌త‌క‌డుతున్నారు. అయితే ఈ సినిమా కోసం రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్ ఏర్పాటు చేయ‌గా, ఇందులో అజిత్‌, న‌య‌న్‌ల‌పై ప్రేమ స‌న్నివేశాల‌తో పాటు రొమాంటిక్ గీతాల‌ని కూడా తెర‌కెక్కించారు. ముంబైలో చిన్న షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నటీం రాజమండ్రికి వెళ్ళింది. అక్క‌డ కొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాల‌ని తెర‌కెక్కిస్తున్నారు. అజిత్ మూవీ షూటింగ్ జరుగుతుంద‌న్న విష‌యం తెలుసుకున్న అభిమానులు లొకేష‌న్‌కి భారీగా చేరుకున్నారు. కొంద‌రు అభిమానుల‌తో ఫోటోలు దిగి వారిని ఆనంద‌ప‌ర‌చారు అజిత్‌. విశ్వాసం చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి డి. ఇమాన్‌ సంగీతం అందిస్తున్నారు.

3451
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles