హైద‌రాబాద్ వాతావ‌ర‌ణంపై ఆ హీరో ఏమ‌న్నాడో తెలుసా ?

Sat,December 30, 2017 09:22 AM
raj tarun comments on hyderabad weather

స్లో అండ్ స్ట‌డీగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న యంగ్ హీరో రాజ్ త‌రుణ్‌. మినిమం హిట్స్ సాధించిన ఈ హీరో ప్ర‌స్తుతం రాజుగాడు, ల‌వ‌ర్స్ అనే సినిమా చేస్తున్నాడు. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్స్ విదేశాల‌లో జ‌రుగుతున్నాయి. అయితే రీసెంట్‌గా షెడ్యూల్ ముగియ‌డంతో హైద‌రాబాద్‌కి వ‌చ్చాడు రాజ్ త‌రుణ్‌. వ‌చ్చి రాగానే త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా హైద‌రాబాద్ వాతావ‌ర‌ణంపై వెరైటీ కామెంట్ చేశాడు రాజ్ త‌రుణ్. కొద్ది రోజులుగా హైద‌రాబాదీల‌ని వ‌ణికిస్తున్న చ‌లి రాజ్ త‌రుణ్‌కి కూడా వెల్‌క‌మ్ చెప్పింద‌ట‌. దీంతో ట్విట్ట‌ర్‌లో హైదరాబాద్ వాతావరణం గురించి ఘాటు ట్వీట్ చేశాడు. ‘‘హైదరాబాద్ వాతావరణం కాఫీలా ఉంటుంది. ఉంటే అతి వేడిగా లేదంటే అతి చల్లగా ఉంటుంది’’ అంటూ రాజ్ తరుణ్ పోస్ట్ చేశాడు. దీనిపై నెటిజ‌న్స్ కొంద‌రు ట్రాఫిక్ బాధ‌లు చెప్పుకుంటుంటే, మ‌రి కొంద‌రు రోడ్ల దుస్థితి గురించి మాట్లాడుతున్నారు.2647
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles