రాయ్ లక్ష్మీ 'రారా వేణు గోపబాల' లిరికల్ వీడియో సాంగ్

Wed,March 6, 2019 06:46 PM


టాలీవుడ్ బ్యూటీ రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి. హార్రర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. పాప అత్తిలి పాప, నాలో ఏం జరుగుతోంది పాటలకు ప్రేక్షకుల నుంచి అద్బుతమైన స్పందన వస్తోంది. ఇక తాజాగా రాయ్ లక్ష్మీ మరో అందమైన పాటతో అందరిని అలరిస్తోంది. 'రారా వేణు గోప బాలా..రాధిక వచ్చెను నిను చేరా' అంటూ సాగే మూడో పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది.


టాలీవుడ్ లోని హీరోయిన్లతో రాయ్ లక్ష్మీని పోలుస్తూ పాడే ఈ పాట అందరిని అలరిస్తోంది. సురేశ్ బనిశెట్టి రాసిన ఈ పాటను హరి గౌర కంపోజ్ చేశారు. కిశోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రవీణ్, మధు నందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

1586
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles