వరుస ప్రాజెక్టులతో బిజీగా రాహుల్ రామకృష్ణ

Mon,December 10, 2018 10:15 PM
rahulramakrishna says about upcoming movies

‘హాస్యనటుడిగానే నాకుండా విభిన్న తరహా పాత్రలతో ప్రతిభను నిరూపించుకోవాలన్నదే నా అభిమతం’ అని అన్నారు రాహుల్ రామకృష్ణ. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘హుషారు’. లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్, రియాజ్ నిర్మించారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. ఈ నెల 14న విడుదలకానుంది.

సోమవారం హైదరాబాద్ రాహుల్ రామకృష్ణ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ఈ సినిమాలో సాఫ్ట్ ఇంజనీర్ నటించాను. ఉద్యోగం అంటే ఇష్టం ఉండదు. కానీ విధిలేని పరిస్థితుల్లో ఆ వృత్తిని చేపట్టిన అతడికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? ఓ నలుగురు యువకులతో అతడికి ఉన్న సంబంధం ఏమిటన్నది సినిమాలో ఆసక్తిని పంచుతుంది. ద్వితీయార్థం మొత్తం నా పాత్ర కనిపిస్తుంది. ‘అర్జున్ తర్వాత ఎక్కువ నిడివి కలిగిన పాత్రలో నేను నటిస్తున్న చిత్రమిది. జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే జ్ఞాపకాలే తప్ప ఇంకేం ఉండవనే సందేశంతో దర్శకుడు శ్రీహర్ష ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వినోదంతో పాటు భావోద్వేగాల మిళితంగా నా పాత్ర సాగుతుంది. సాఫ్ట్ ఇంజనీర్ పాత్ర కోసం నా స్నేహితుల జీవితాల్ని స్ఫూర్తిగా తీసుకొని నటించాను. ఇందులో నాపై తెరకెక్కించిన ‘పిచాక్..’పాటకు మంచి స్పందన లభిస్తున్నది. ‘భరత్ అనే నేను’లో నా పంథాకు భిన్నంగా కనిపించాను. కానీ ఆ పాత్రకు పూర్తిగా న్యాయం చేయలేకపోయాననిపించింది. ఆ మాటే దర్శకుడు కొరటాల శివతో చెప్పాను. ప్రస్తుతం వెబ్ కోసం కథలు రాస్తున్నాను. దర్శకత్వం మాత్రం చేయను. అలాగే హీరోగా నటించాలనే ఆలోచన లేదు. డ్యాన్స్, ఫైట్లు చేయలేను. సందీప్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘నిను వీడని నీడను నేను’ సినిమాలో విలన్ నటిస్తున్నాను. అలాగే రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్.ఆర్.ఆర్’లో ఓ కీలక పాత్ర చేస్తున్నాను. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కల్కి’తో పాటు శ్రీవిష్ణుతో మరో సినిమా చేయబోతున్నాను’అని తెలిపారు.

2430
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles