పెళ్ళి పీట‌లెక్క‌బోతున్న పాపుల‌ర్ క‌మెడీయన్

Tue,October 23, 2018 01:44 PM
Rahul Ramakrishna marries on january

సైన్మా అనే షార్ట్ ఫిలింతో అంద‌రి దృష్టిలో ప‌డి ఆ త‌ర్వాత అర్జున్ రెడ్డి చిత్రంతో ఫుల్‌ పాపుల‌ర్ అయిన క‌మెడీయ‌న్ రాహుల్ రామ‌కృష్ణ‌. ఇటీవ‌ల విడుద‌లైన గీత గోవిందం చిత్రంలో హీరో ఫ్రెండ్ క్యారెక్ట‌ర్‌లో న‌టించి న‌వ్వుల పువ్వులు పూయించాడు. డిఫ‌రెంట్ ఆటిట్యూడ్‌, డైలాగ్ డెలివ‌రీలో కొత్త ద‌నం చూపిస్తూ ప్రేక్ష‌కుల‌ని ఆక‌ర్షిస్తున్నాడు. అయితే ఈ కుర్ర క‌మెడీయ‌న్ త్వ‌ర‌లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ పేజ్‌లో వినూత్నంగా తెలిపి అంద‌రికి షాక్ ఇచ్చాడు.

త‌న‌కి కాబోయే భ‌ర్త‌తో బీచ్ ప‌క్క‌న ఫోటో దిగిన రాహుల్ రామ‌కృష్ణ ఆ ఫోటోని ట్విట్ట‌ర్‌లో షేర్ చేస్తూ .. ‘జనవరి 15న నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఎవరికీ చెప్పకండి’ అంటూ కామెంట్‌ చేశాడు. రాహుల్ పోస్ట్ చేసిన ఫోటోలో వీరి మొహాలు సరిగ్గా క‌నిపించ‌క‌పోవ‌డంతో అమ్మాయి ఎలా ఉంటుందో అని ఆలోచ‌న‌లు చేస్తున్నారు అభిమానులు. త‌న పెళ్ళి విష‌యం చెప్పిన రాహుల్‌ కు శుభాకాంక్షలు వెళ్లువెత్తాయి. నిఖిల్ సిద్ధార్థ్, సుశాంత్‌, కమెడియన్ వెన్నెల కిశోర్‌, విద్యుల్లేఖ రామన్ లతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు రాహుల్‌కి శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.


4202
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS