హాలీవుడ్ సినిమాలో టాలీవుడ్ క‌మెడీయ‌న్

Sat,February 2, 2019 11:16 AM
Rahul Ramakrishna Is Making His Hollywood Debut

సైన్మా అనే షార్ట్ ఫిలింతో అంద‌రి దృష్టిలో ప‌డి ఆ త‌ర్వాత అర్జున్ రెడ్డి చిత్రంతో ఫుల్‌ పాపుల‌ర్ అయిన క‌మెడీయ‌న్ రాహుల్ రామ‌కృష్ణ‌. ఇటీవ‌ల విడుద‌లైన గీత గోవిందం చిత్రంలో హీరో ఫ్రెండ్ క్యారెక్ట‌ర్‌లో న‌టించి న‌వ్వుల పువ్వులు పూయించాడు.. హుషారు చిత్రంతోను అల‌రించాడు. డిఫ‌రెంట్ ఆటిట్యూడ్‌, డైలాగ్ డెలివ‌రీలో కొత్త ద‌నం చూపిస్తూ ప్రేక్ష‌కుల‌ని ఆక‌ర్షిస్తున్నాడు. అయితే ఈ కుర్ర క‌మెడీయ‌న్ త్వ‌ర‌లో హాలీవుడ్‌కి ప‌రిచ‌యం కానున్నాడ‌ని అంటున్నారు. సిల్క్ రోడ్ అనే క్రైమ్ థ్రిల్ల‌ర్‌లో రాహుల్ కీల‌క పాత్ర పోషించ‌నున్నాడు. ప్ర‌దీప్ క‌ట‌సాని ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. సిల్క్ రోడ్ అనే చిత్రం ఒక తెలుగు గ్రాడ్యుయేట్ నేప‌థ్యంలో ఉంటుంద‌ట‌. అతను తన ఉన్నత విద్య కోసం US వెళ్తాడు, ప‌లు ఇబ్బందులు ప‌డ‌తాడు. డ్ర‌గ్స్‌, సైబ‌ర్‌క్రైమ్ నేప‌థ్యంలో చిత్ర క‌థ‌ తిరుగుతుంది. హాలీవుడ్ చిత్రంలో న‌టిస్తున్నందుకు రాహుల్ సంతోషంగా ఉన్నాడు. ఈ సినిమా కోసం ఎంతో కాలం నుండి వేచి చూసాను. చివ‌రికి ఇప్పుడు ఒకే అయినందుకు సంతోషంగా ఉన్నాను అని రాహుల్ అన్నాడు.

5504
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles