రాజ‌కీయాల‌కి గుడ్ బై: బండ్ల గ‌ణేష్‌

Fri,April 5, 2019 08:54 AM
Rahul Gandhi says good bye to politics

న‌టుడిగా, నిర్మాత‌గా ఇండ‌స్ట్రీలో రాణించిన బండ్ల గ‌ణేష్‌ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కప్పు కండువా కప్పుకున్నసంగ‌తి తెలిసిందే. షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన ఆయ‌న‌కి నిరాశే ఎదురైంది. టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న బండ్ల గ‌ణేష్ తాను రాజ‌కీయాల నుండి త‌ప్పుకుంటున్న‌ట్టు త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. నా వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నాను. నాకు అవకాశం కల్పించిన రాహుల్ గాంధీ గారికి, ఉత్తమ్ గారికి కృతజ్ఞతలు. ఇక నుంచి నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నా విమర్శలు, వ్యాఖ్యల వల్ల బాధపెట్టిన వారిని పెద్ద మనసుతో క్షమించమని కోరుతున్నాను అంటూ బండ్ల గ‌ణేష్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. బండ్ల గ‌ణేష్ ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ఎపీ సీఎంగా చూడాలని ఉంద‌ని మ‌న‌సులో మాట‌ని బ‌య‌ట‌పెట్టిన విష‌యం తెలిసిందే.

2617
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles