ఫ్యాన్స్‌కి క్ష‌మాప‌ణ‌లు తెలిపిన క‌మెడీయ‌న్‌

Sat,February 23, 2019 10:54 AM
rahul Apologizes Fans And Regrets Actings In Mithai

అర్జున్ రెడ్డి సినిమాతో అంద‌రి దృష్టిలో ప‌డ్డ యంగ్ క‌మెడీయ‌న్ రాహుల్ రామ‌కృష్ణ‌. రీసెంట్‌గా ఆయ‌న మిఠాయి అనే డార్క్ కామెడీ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. రెడ్ యాంట్స్ పతాకంపై డాక్టర్ ప్రభాత్ కుమార్ నిర్మించారు. నూత‌న ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్రియద‌ర్శి కూడా చిత్రంలో కీల‌క పాత్ర పోషించారు. మిఠాయి చిత్రం ప్రేక్ష‌కుల‌ని ఏ మాత్రం అలరించ‌క‌పోగా, అభిమానుల‌ని నిరాశ‌ప‌ర‌చింది. దీంతో రాహుల్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఫ్యాన్స్‌కి క్ష‌మాప‌ణ‌లు తెలియ‌జేస్తూ వ‌రుస ట్వీట్స్ చేశారు.

మంచి సినిమాని మీ ముందుకు తెచ్చేందుకు ఎంత‌గానో ప్ర‌య‌త్నించాం. మా ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. సినిమా ఫ‌లితాన్ని ముందుగానే అంచ‌నా వేసాం. ద‌ర్శ‌కుడి ఆలోచ‌న‌లు ఆయ‌న ఇమాజినేష‌న్‌ని త‌ప్పక గౌర‌విస్తాను. ఈ సినిమాతో నాకు జ్ఞానోద‌యం ఉంది. ఒత్తిడితో ప‌నిచేస్తే స‌రైన రిజ‌ల్ట్స్ రావు అనేది బాగా తెలిసింది. ఈ సినిమాకి మిక్స్‌డ్ టాక్ రావ‌డంతో నాకు వేల కొల‌ది మెసేజ్‌లు వ‌చ్చాయి. అవి నా హృద‌యాన్ని క‌దిలించాయి. మ‌రోసారి నా స్నేహితుడు ప్రియ‌ద‌ర్శితో క‌లిసి మంచి వినోదం అందిస్తాన‌ని కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. మీ ప్రేమాభిమానులు ఎప్ప‌టికి ఇలానే ఉండాల‌ని కోరుకుంటున్నాను అని రాహుల్ రామ‌కృష్ణ ట్వీట్‌లో తెలిపారు.

3651
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles