రాహుల్‌, హిమ‌జ ప్రేమాయ‌ణం.. ప‌గ‌ల‌బ‌డి న‌వ్విన‌ పున్ను

Thu,September 19, 2019 08:23 AM

బిగ్ బాస్ సీజ‌న్ 3 తొమ్మిదో వారం ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష‌గా మారింది. ఈ వారంలో టాస్క్‌లు గ‌త సీజ‌న్ మాదిరిగానే ఉండ‌డం, ఇంటి స‌భ్యులు తెగ జీవించ‌డం బోర్ తెప్పిస్తుంది. 60వ ఎపిసోడ్‌లో శివ‌జ్యోతి క‌న్నీటికి అడ్డుక‌ట్ట వేసే ప్ర‌య‌త్నం చేశారు బాబా భాస్క‌ర్ , రాహుల్‌, ర‌వి. మంగ‌ళ‌వారం ఎపిసోడ్‌లో బాబా భాస్క‌ర్ .. శివ‌జ్యోతిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్య‌లు చేయ‌డంతో వాటిని త‌ల‌చుకుంటూ తెగ ఏడ్చేసింది.


60వ ఎపిసోడ్‌లోను బిగ్ బాస్ కాలేజ్ హంగామా కొన‌సాగింది. బాబా భాస్క‌ర్ ల‌వ్వాల‌జీ క్లాసులు, వితికా గాస్సిపాల‌జీ క్లాసులు, వ‌రుణ్ సందేశ్ చిల్లాల‌జీ క్లాసులు చెప్పారు. అయితే బాబా భాస్క‌ర్, వితికా జ‌డ్జ్‌లుగా వ్య‌వ‌హ‌రించిన టాస్క్‌లో ఇంటి స‌భ్యులు రెండు జంటలుగా ఏర్ప‌డి ప్రేమాయ‌ణం న‌డిపించారు. వీరిలో హిమ‌జ‌, రాహుల్ జంట ప‌ర్‌ఫార్మెన్స్ జ‌డ్జెస్‌గా ఉన్న బాబా భాస్క‌ర్‌, వితికాల‌కి న‌చ్చ‌డంతో వారిని విజేత‌లుగా ప్ర‌క‌టించారు.

విజేత‌లుగా నిలిచిన రాహుల్‌, హిమ‌జ‌లు మ‌నోహ‌ర‌.. అనే పాట‌కి డ్యాన్స్ చేయ‌గా వారి ప‌ర్‌ఫార్మెన్స్‌ని ఇంటి స‌భ్యులు తెగ ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా వారిద్ద‌రు హ‌గ్‌లు చేసుకోవ‌డం, హిమ‌జ ఉరుక్కుంటూ వ‌చ్చి రాహుల్‌పైకి ఎక్క‌డం వంటివి చూస్తూ పున‌ర్న‌వి తెగ న‌వ్వుతూ ఎంజాయ్ చేసింది. బాబా భాస్క‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో సాగిన ప‌ర్‌ఫార్మెన్స్ ఈ ఎపిసోడ్‌లో కొంత బెట‌ర్ అని చెప్ప‌వ‌చ్చు.

5610
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles