లెజండరీ స్టార్స్ కాంబినేషన్ లో ‘మామ్’

Sat,April 1, 2017 11:56 AM
rahman working for mom

ఒకరు డబుల్ ఆస్కార్ అవార్డ్ విన్నర్, మరొకరు 50 ఏళ్ల వయస్సులో 300 సినిమాలు చేసిన ఎవర్ గ్రీన్ బ్యూటీ. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ రూపొందనుందనే వార్త ఫ్యాన్స్ ని ఫుల్ ఎంటర్ టైన్ చేస్తుంది. బాలీవుడ్ లో మచ్ ఎవైటెడ్ ఉమెన్ సెంట్రిక్ మూవీగా మామ్ అనే ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రవి ఉద్యావర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల ఓ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ కి మూవీ లవర్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా జూలై 14,2017న చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో టీం ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చనున్నట్టు తెలుస్తుంది. తొలిసారి ఇద్దరు లెజండరీ స్టార్స్ శ్రీదేవి, ఏఆర్ రెహమాన్ లు మామ్ కి కలిసి పనిచేయనుండడం ఇప్పుడు బాలీవుడ్ నాట హాట్ టాపిక్ గా మారింది. ఈ కాంబోలో రాబోతున్న చిత్రం సంచలనాలు క్రియేట్ చేయడం ఖాయం అని అంటున్నారు. మామ్ చిత్రంలో ఇద్దరు పాకిస్థానీ నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అందులో ఒకరు శ్రీదేవి భర్త పాత్ర చేస్తున్న అద్నాన్ సిద్దిఖి కాగా, మరొకరు ఆమె కూతురిగా నటిస్తున్న సజల్‌ అలీ. నవాజుద్దీన్ సిద్దిఖీ, అక్షయ్ ఖన్నా లు కీలక పాత్రలో కనిపించనున్నారు. జీ స్టూడియోస్ బేనర్ పై మామ్ చిత్రాన్ని బోనీ కపూర్ మరియు సునీల్ మంచంద సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

1072
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles