ర‌ఘుప‌తి వెంక‌య్య నాయుడు ట్రైల‌ర్ విడుద‌ల చేసిన మ‌హేష్‌

Sat,November 9, 2019 01:25 PM

ఫాద‌ర్ ఆఫ్ తెలుగు సినిమాగా పిలుచుకునే ర‌ఘుప‌తి వెంక‌య్య నాయుడు జీవిత నేప‌థ్యంలో తెలుగు సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. సీనియ‌ర్ న‌టుడు నరేష్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ సినిమాకి `రఘుపతి వెంకయ్య నాయుడు` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. బాబ్జీ ద‌ర్శ‌క‌త్వంలో ఎల్లో లైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మండవ సతీష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 29న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర ట్రైల‌ర్‌ను సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. యూనిట్ అంద‌రికి ఈ సంద‌ర్భంగా అభినంద‌న‌లు తెలిపారు.


తెలుగు సినిమా కోసం రఘుపతి వెంకయ్యగారు చేసిన కృషిని గుర్తు చేయడానికి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ద‌ర్శ‌కుడు పేర్కొన‌గా, 'రఘుపతి వెంకయ్యగారి పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం ఇది. తెలుగు సినిమా బతికున్నంత వరకూ ఈ చిత్రం అందరికీ గుర్తుండిపోతుంది' అని న‌రేష్ అన్నారు. ఈ చిత్రంలో తణికెళ్ల భరణి, మహర్షి, వాహిని, సత్య ప్రియ, భావన, శక్తిమాన్‌, అఖిల్‌ సన్నీ, మునిచంద్ర, సాయికాంత్‌, చాణక్య, దేవ్‌ రాజ్‌ తదితరులు నటించారు.

1380
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles