మదర్‌ థెరిసా అవార్డు అందుకున్న లారెన్స్

Fri,September 14, 2018 12:13 PM
Raghava Lawrence Receives Mother Teresa Award

నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ ఇలా మ‌ల్టీ టాలెంట్‌తో ఉన్న‌త స్థాయిలో నిలిచిన‌ లారెన్స్ కేవ‌లం సినిమాలతోనే కాదు సామాజిక సేవలతోను ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. కష్టాలలో ఉండేవారికి ఎప్పుడు తాను అండగా ఉన్నాననే భరోసా ఇస్తుంటాడు. ది లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు లారెన్స్‌. ఇప్పటివరకు 150 కి పైగా చిన్నారుల‌కి ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించారు. అనాధ‌ల‌కి అండగా నిలిచే లారెన్స్ ఇటీవ‌ల కేర‌ళ వ‌ర‌ద‌ల వ‌ల‌న నిరాశ్ర‌యిల‌న వారికి కోటి రూపాయ‌లు విరాళంగా ఇచ్చారు. అయితే త‌నలో సేవా గుణాన్ని గుర్తించిన మదర్‌ థెరిసా ఛారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు గురువారం సాయంత్రం చెన్నై, తేరనాపేటలోని కామరాజర్‌ ఆవరణలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో లారెన్స్‌కి మ‌ద‌ర్ థెరిసా అవార్డ్ ఇచ్చి స‌త్క‌రించారు. ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేస్తూ త‌న సేవ‌ల‌ని గుర్తించిన వారికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. కార్య‌క్ర‌మానికి పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్మావి, తమిళనాడు కాంగ్రేశ్‌ పార్టీ అధ్యక్షుడు తిరునావుక్కరసన్, కాంగ్రేస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు ఇవీకేఎస్‌. ఇళంగోవన్, పీఎంకే పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు అన్బుమణి రామదాస్, వసంతకుమార్‌తో పాటు పలువురు ముఖ్య అతిధులు హాజ‌ర‌య్యారు. కార్య‌క్ర‌మంలో ట్ర‌స్ట్ ద్వారా ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు కూడా చేప‌ట్టారు.1908
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles