బిగ్ బాస్ వాయిస్ ఎవ‌రిది అనుకుంటున్నారు ?

Sat,June 16, 2018 09:38 AM
radha krishna as big boss in 2 seasons

ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజ‌న్ 1, నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజ‌న్ 2 ల‌లో ఎవ‌రికి క‌నిపించ‌కుండా ఓ వ్య‌క్తి హౌజ్‌లోని అంద‌రు కంటెస్టెంట్స్‌ని కంట్రోల్‌ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. గాంభీర్య‌మైన గొంతుతో భ‌య‌పెట్టించే ఆ వ్య‌క్తి అప్పుడ‌ప్పుడు టాస్క్‌లు ఇస్తూ, రూల్ అదిగ‌మిస్తే వారిని హెచ్చ‌రిస్తూ ఉంటారు. అజ్ఞాత‌వాసిలా ఉండే బిగ్ బాస్ ఎవ‌ర‌నే విష‌యాన్ని సీజ‌న్ 1 పూర్తైన త‌ర్వాత రివీల్ చేస్తార‌ని అప్ప‌ట్లో అంద‌రు భావించారు. కాని అలాంటిదేమి లేకుండా షో ముగించేశారు. ఇప్పుడు సీజ‌న్ 2 మొద‌లైంది. ఇందులోను బిగ్ బాస్‌ది అదే గొంతు. మ‌రి గంభీర‌మైన గొంతుతో ఉన్న ఆ గంభీర‌మైన మ‌నిషి ఎవ‌ర‌నే ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది.

సీజ‌న్ 1, సీజ‌న్ 2ల‌లో హోస్ట్ , కంటెస్టెంట్స్ మారారే త‌ప్ప బిగ్ బాస్ మార‌లేదు. అదే పంథాలో తన వాయిస్‌తో కొత్త కంటెస్టెంట్‌ల‌ని అదుపులో ఉంచుతున్నాడు. మ‌రి ఆ బిగ్ బాస్ మ‌రెవ‌రో కాదు సీనియ‌ర్ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ రాధా కృష్ణ‌. బిగ్ బాస్ వాయిస్ కోసం ఎంతోమందితో ఆడిష‌న్స్ చేయించి చివ‌రికి ఈయ‌న‌ని సెల‌క్ట్ చేశారు. మా టీవీలో వ‌చ్చే సీఐడీ సీరియ‌ల్‌లో కూడా ఈయ‌న డ‌బ్బింగ్ చెప్పేవారు. అయితే ఆ గొంతు ఇంత‌క‌ముందు విన్నార‌నే ఫీల్ రాకుండా, ఫ్రెష్ ఫీలింగ్ వ‌చ్చేలా చేయ‌టంలో రాధాకృష్ణ విజ‌యం సాధించాడు. ఈ క్ర‌మంలో రెండు సీజ‌న్స్‌కి ఆయ‌న‌నే త‌న వాయిస్‌తో బిగ్ బాస్‌గా మెప్పిస్తున్నాడు. హిందీ బిగ్ బాస్ లో గంబీరమైన వాయిస్ తో అతుల్ కపూర్ బిగ్ బాస్ గా అలరించాడు. ఇప్పుడు తెలుగులో రాధాకృష్ణ కూడా బిగ్ బాస్‌గా స‌క్సెస్ సాధించాడ‌నే చెప్ప‌వ‌చ్చు.

6806
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles