రంగ‌మ్మ‌త్త‌గా సుకుమార్ ఫ‌స్ట్ చాయిస్ ఎవ‌రో తెలుసా!

Sat,November 9, 2019 10:56 AM

రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సుకుమార్ తెర‌కెక్కించిన గ్రామీణ నేప‌థ్య చిత్రం రంగ‌స్థ‌లం. ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇందులో రామ్ చ‌ర‌ణ్‌ చిట్టిబాబు పాత్ర‌లో సంద‌డి చేస్తే స‌మంత రామ‌ల‌క్ష్మీ పాత్ర‌లో కనువిందు చేసింది. రంగ‌మ్మ‌త్త పాత్ర‌లో అన‌సూయ అద‌ర‌గొట్టింది. గ్లామర్, ఎమోషన్, ప‌ర్‌ఫార్మెన్స్ అన్ని స‌మ‌పాళ్ళ‌లో క‌న‌బ‌ర‌చి మంచి పేరు తెచ్చుకుంది. ఈ చిత్రంతో అన‌సూయ ఒక్క‌సారిగా లైమ్‌లైట్‌లోకి వ‌చ్చింది. అయితే ఈ పాత్ర కోసం ఎంద‌రో పేర్ల‌ని ప‌రిశీలించిన సుకుమార్ చివ‌రికి అన‌సూయ‌ని ఫైన‌ల్ చేసాడ‌ట‌. కాని అంద‌రికంటే ముందుగా సుకుమార్ సంప్ర‌దించింది అల‌నాటి అందాల తార రాశి అని స‌మాచారం. సుకుమార్‌.. రాశికి స్క్రిప్ట్ న‌రేట్ చేయ‌గా, ఇందులో మోకాలికి పైకి చీర ధరించడం, కాస్ల గ్లామ‌ర్‌గా ఉండ‌డం రాశికి ఇబ్బందిగా అనిపించిందట‌. ఇందుకోసం రంగ‌మ్మ‌త్త పాత్ర‌ని రాశి సున్నితంగా తిరస్క‌రించింది అని అంటున్నారు.

2201
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles