లవ్లీ డైరెక్ట‌ర్ కోసం స్పెష‌ల్ రోల్ చేస్తున్నాన‌న్న రాశీ

Thu,September 14, 2017 02:53 PM
Raashi Khanna?  special role in raja the great

గ్లామ‌ర్ బ్యూటీ రాశీ ఖ‌న్నా త‌న అంద చందాల‌తో టాలీవుడ్ ఆడియ‌న్స్ మ‌న‌సులు దోచుకుంది. సెల‌క్టెడ్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్న ఈ అమ్మ‌డికి ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం జై ల‌వ‌కుశ చిత్రం ద్వారా వ‌చ్చింది. ఇందులో రాశీ పాత్ర చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉండ‌డంతో పాటు అమ్మ‌డ‌కి మంచి పేరు తెచ్చేదిగా ఉంటుంద‌ని స‌మాచారం. అయితే ఈ అమ్మ‌డు తాజాగా త‌న ట్విట్ట‌ర్ ఎకౌంట్ ద్వారా నా లవ్లీ డైరెక్ట‌ర్ కోసం ‘రాజా ది గ్రేట్’ సినిమాలో షార్ట్ అండ్ స్పెష‌ల్ అప్పీయ‌రెన్స్ ఇవ్వ‌బోతున్న‌ట్టు తెలిపింది. ర‌వితేజ‌, మెహ‌రీన్ ప్ర‌ధాన పాత్ర‌లో రాజా ది గ్రేట్ చిత్రం తెర‌కెక్కుతుండ‌గా, ఈ చిత్రాన్ని అనీల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. సుప్రీమ్ సినిమా కోసం అనీల్ రావిపూడి డైరెక్షన్‌లో రాశీ ఖ‌న్నా ప‌నిచేసినందున ఈ రిలేషన్‌షిప్ కార‌ణంగానే రాజా దిగ్రేట్ చిత్రంలోని ఓ సాంగ్‌లో రాశీని స్పెష‌ల్ అప్పీయ‌రెన్స్‌లో చూపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. రాశీ ఖ‌న్నా ప్ర‌స్తుతం మాస్ మహారాజ రవితేజ ‘టచ్ చేసి చూడు’ చిత్రంతో పాటు మెగాహీరో వరుణ్ తేజ్ తో ఒక రొమాంటిక్ ఎంటర్టైన‌ర్ , విల‌న్ అనే మళయాళ చిత్రం, ఓ త‌మిళ చిత్రంతో బిజీగా ఉంది.


1313
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS