వాయిస్ ఓవ‌ర్ ఆర్టిస్ట్‌కి సారీ చెప్పిన రాశీ ఖ‌న్నా

Fri,May 17, 2019 12:39 PM
Raashi Khanna says sorry to raveena

అందాల భామ రాశీ ఖ‌న్నా న‌టించిన తాజా చిత్రం అయోగ్య‌. ఎన్టీఆర్‌, పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన టెంప‌ర్ చిత్రానికి రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రానికి నవ దర్శకుడు, ఏఆర్‌.మురుగదాస్‌ శిష్యుడు వెంకట్‌మోహన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రంలో విశాల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించి అల‌రించాడు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ చిత్రం త‌మిళ తంబీల‌ని కూడా ఆక‌ట్టుకుంటుంది. అయితే ఈ సినిమా పూర్త‌య్యాక వచ్చే ఎండ్ టైటిల్స్ లో వాయిస్ ఆర్టిస్టులకు క్రెడిట్స్ ఇవ్వలేదు. దీనిపై రాశీ ఖ‌న్నాకి డ‌బ్బింగ్ చెప్పిన డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ ర‌వీనా ఎస్‌.ఆర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

అయోగ్య చిత్రం పూర్తైన త‌రువాత వ‌చ్చే ఎండ్ టైటిల్స్‌లో డ‌బ్బింగ్ ఆర్టిస్టుల పేర్లు లేక‌పోవ‌డం బాధ‌గా ఉంది. అయితే మెస్ అన్న‌లు, డ్రైవ‌ర్లు, పెయింట‌ర్లు, కార్పెంట‌ర్లు, సౌండ్ ఇంజ‌నీర్స్‌,స్టూడియోస్‌, కో ఆర్డినేట‌ర్స్ త‌దిత‌ర డిపార్ట్‌మెంట్‌ల‌కి సంబంధించిన వారి కి క్రెడిట్స్ ఇవ్వ‌డం సంతోషంగా ఉంది. చాలా సార్లు మా కేట‌గిరికి క్రెడిట్స్ ఇవ్వ‌క‌పోవ‌డం బాధ క‌లిగిస్తోందని ట్వీట్ చేశారు ర‌వీనా. దీనిపై స్పందించిన రాశీఖ‌న్నా .. నన్ను క్ష‌మించు ర‌వీనా. స్క్రీన్ మీద న‌న్ను ఎలివేట్ చేయ‌డానికి అంద‌మైన గొంతు ఇచ్చిన మీకు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అని పేర్కొంది. అయితే ఎండ్ కార్డ్స్‌లో డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ పేరు వేయ‌క‌పోవ‌డానికి, రాశీకి ఏం సంబంధం లేకపోయిన వారి స‌మ‌స్య‌పై ఈ అమ్మడు స్పందించ‌డంతో నెటిజ‌న్స్ రాశీని ప్ర‌శంసిస్తున్నారు .2336
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles