క‌ట్టిన‌దానికి డ‌బుల్ బిల్ వ‌స్తుందంటున్న రాయ్ ల‌క్ష్మీ

Wed,July 17, 2019 08:13 AM
Raai Laxmi says her problem in social media

తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న న‌టి రాయ్ ల‌క్ష్మీ. ఒక‌వైపు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సినిమాలు చేస్తూనే మ‌రోవైపు స్పెష‌ల్ సాంగ్స్‌తో అలరిస్తుంది. ఆ మ‌ధ్య‌ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది. అయితే ప్ర‌స్తుతం త‌న‌కో స‌మ‌స్య వ‌చ్చింద‌ని ఆ స‌మ‌స్య‌కి దారి చూపించండ‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా కోరింది. దీంతో వెంట‌నే స్పందించిన ఆదాని ఎల‌క్ట్రిసిటీ సిబ్బంది వివ‌రాల‌ని పంపిస్తే స‌మ‌స్య‌ని సాల్వ్ చేస్తామ‌ని పేర్కొన్నారు. వివ‌రాల‌లోకి వెళితే రాయ్ ల‌క్ష్మీ కొన్నాళ్లుగా టైంకి క‌రెంట్ బిల్ పే చేస్తుంద‌ట‌. ఎంత బిల్ పే చేస్తే అంత‌కు డ‌బుల్ బిల్ మ‌రుస‌టి నెల వ‌స్తుంది. ఈ విష‌యం గురించి ఆదాని ఎలక్ట్రీసిటీ సంస్థకు చెందిన టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేస్తే ఎంతకు కలవడం లేదన్నారు. త‌న ప‌రిస్థితే ఇలా ఉంటే సామాన్యుల ప‌రిస్థితి ఏంట‌ని ఆమె ప్ర‌శ్నిస్తుంది. ఈ స‌మస్య నుండి గ‌ట్టెక్కించ‌మ‌ని కూడా కోరింది. కష్టపడి సంపాదించిన సొమ్ము ఇలా ఉచితంగా కట్టాలంటే బాధగా ఉంది’ అని త‌న ట్వీట్‌లో తెలిపింది రాయ్ ల‌క్ష్మీ. ఈ విష‌యంపై ట్విటర్‌ వేదికగా ఆదాని ఎలక్ట్రిసిటీ స్పందించింది. ‘అసౌకర్యానికి చింతిస్తున్నాం. దయచేసి మీ వివరాలను తెలియజేస్తే సమస్యను పరిష్కరిస్తాం’ అని పేర్కొంది. రాయ్ ల‌క్ష్మీ ప్ర‌స్తుతం ‘టిస్ఫై’ అనే హిందీ చిత్రంలో న‌టించేందుకు సిద్ధ‌మైంది. దీపక్‌ తిజోరీ దర్శకత్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో నాజియా హుస్సే నామి, షామా సికందర్, అలంకృత సహై, కైనత్‌ అరోరా కీలక పాత్రల్లో నటించనున్నారు. సెప్టెంబర్ నుండి లండన్‌లో చిత్రీక‌ర‌ణ మొద‌లు కానుంది.

895
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles