రాధికకి కేన్సర్ అంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన అలనాటి తార

Tue,May 22, 2018 03:31 PM
Raadhika Sarathkumar condense the rumors

డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రభావం జనాలపై ఏ రేంజ్ ప్రభావం చూపుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచి, చెడులు క్షణాలలో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక సెలబ్రిటీల విషయం గురైతే అసలే చెప్పనక్కర్లేదు. జరగనివి జరిగినట్టు, జరిగినవి జరగనట్టు ప్రచారం చేస్తూ అభిమానులని భయాందోళనలకి గురి చేస్తున్నారు. తాజాగా సీనియర్ నటి రాధికకి బ్లడ్ కేన్సర్ అని, అందుకే కొన్నాళ్ళుగా బయట ఎక్కువగా కనిపించడం లేదంటూ ప్రచారం జరుగుతుంది. ఇదే విషయంపై ఓ అభిమాని రాధికని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. దీనికి రాధిక ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని, అవన్నీ ఊహాగానాలే అంటూ కొట్టి పారేసింది.


3269
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS