బాలీవుడ్ లో మరో కిలికి భాష..

Fri,May 19, 2017 10:14 PM
Raabta makers create a new language for the movie


ముంబై: బాలీవుడ్ స్టార్లు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్, కృతిసనన్ కాంబినేషన్‌లో ‘రాబ్తా’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రెండు యుగాల మధ్య నెలకొన్న సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ కొత్త భాషను సృష్టించినట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. మూవీ రైటర్స్ ఖారీ బోలి, అవాదీ, బ్రిజ్ భాషలను కలిపి కొత్త భాషను సృష్టించారు. ఇప్పటికే రాజమౌళి సృష్టించిన కిలికి భాష బాహుబలి సినిమాకు ఏ రేంజ్‌లో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిందో చెప్పక్కర్లేదు. మరీ రాబ్తా మూవీ కోసం క్రియేట్ చేసిన కొత్త భాష సినిమాకు ఏ మేర ఉపయోగపడుతుందో చూడాలి. దినేశ్ విజన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా జూన్ 9న విడుదల కానుంది.

2377
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS