ద‌ర్శ‌కుడిగా శ్రీకాంత్‌.. ట్రైల‌ర్ అదుర్స్‌

Sun,February 18, 2018 01:40 PM
Raa Raa Movie Theatrical Trailer

ప్ర‌స్తుతం హీరోతో పాటు స‌పోర్టింగ్ రోల్స్‌లో న‌టిస్తున్న శ్రీకాంత్ తాజా చిత్రం ‘రా..రా’. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కక్కుతున్న ఈ సినిమాలో న‌జియా క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ద‌ర్శ‌కుడిగా ఈ చిత్రంలో న‌టిస్తున్నాడు శ్రీకాంత్‌. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో స‌న్నివేశాలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. దెయ్యం సినిమా తీయాల‌నుకున్న శ్రీకాంత్‌కి నిజంగానే దెయ్యం కనిపించ‌డం, టీం అంతా షాక్ కావ‌డం లాంటి ఆస‌క్తిక‌ర స‌న్నివేశాల‌తో ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటుంది. అలీ, పోసాని కృష్ణ మురళి, వేణు, గెటప్‌ శీను, చమ్మక్‌ చంద్ర, షకలక శంకర్‌, పృథ్వీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ర్యాప్‌ రాక్‌ షకీల్‌ సంగీతం అందిస్తున్నారు. ఎం.విజయ్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

2275
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS