ఫ్రాన్స్ షెడ్యూల్‌కి ప్యాక‌ప్ చెప్పిన రాణులు

Thu,December 14, 2017 10:21 AM
ఫ్రాన్స్ షెడ్యూల్‌కి ప్యాక‌ప్ చెప్పిన రాణులు

బాలీవుడ్‌లో సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టిన క్వీన్ చిత్రం సౌత్‌లోని నాలుగు భాష‌ల‌లో రీమేక్ అవుతున్న‌ సంగ‌తి తెలిసిందే. హిందీలో కంగనా ర‌నౌత్ పోషించిన పాత్ర‌ని తెలుగులో త‌మ‌న్నా, త‌మిళంలో కాజ‌ల్‌, మ‌ల‌యాళంలో మంజిమా మోహ‌న్‌, క‌న్న‌డ‌లో ప‌రుల్ యాద‌వ్‌లు పోషిస్తున్నారు. నాలుగు భాష‌ల‌కి సంబంధించిన చిత్రీక‌ర‌ణ మొన్న‌టివ‌ర‌కు ఫ్రాన్స్‌లోని ఫ్రెయూజ్ ప‌ట్ట‌ణంలో జ‌రిగింది. తాజాగా ఈ షెడ్యూల్ పూర్తి కావ‌డంతో న‌లుగురు భామ‌లు స‌ర‌దాగా దిగిన ఫోటోల‌ని షేర్ చేశారు. ప్ర‌స్తుతం వీరి పిక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.. క్వీన్ రీమేక్ చిత్రం క‌న్న‌డలో బ‌ట‌ర్‌ఫ్లై అనే టైటిల్‌తో తెర‌కెక్కుతుండ‌గా, తెలుగులో క్వీన్ వ‌న్స్ అగైన్, త‌మిళంలో పారిస్ పారిస్, మ‌ల‌యాళంలో జామ్ జామ్ అనే టైటిల్స్‌తో రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.

791
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS