క్వీన్ రీమేక్ కి సమస్య.. ఒక లాంగ్వేజ్ లో ఆపేయాలనే ఆలోచన

Thu,December 21, 2017 04:46 PM
queen remake gets finance problem

సినిమా తీయడమంటే సినిమా చూసినంత ఈజీ కాదు. ఒక మూవీ తీయాలంటే ఎన్నో సమస్యలుంటాయి. వాటిని తట్టుకోవడం మాటలు కాదు. ఇబ్బందులు కూడా రకరకాలుగా ఉంటాయి. ప్రారంభించిన దగ్గర్నుంచి పూర్తయ్యేవరకూ, ఆ తర్వాత రిలీజయ్యేవరకూ నమ్మకంలేని పరిస్థితులు ఎదురవుతాయి. కోట్లు ఖర్చు పెట్టి తీసే సినిమాకు కూడా ఫీట్లు తప్పవు. క్వీన్ రీమేక్ కూడా ఇప్పుడు అనేక ప్రాబ్లెమ్స్ ను ఫేస్ చేస్తోంది.

బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ కొట్టిన క్వీన్ చిత్రం సౌత్ లోని నాలుగు భాషలలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. హిందీలో కంగనా రనౌత్ పోషించిన పాత్రని తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్, మలయాళంలో మంజిమా మోహన్, కన్నడలో పరుల్ యాదవ్ లు పోషిస్తున్నారు. క్వీన్ రీమేక్ చిత్రం కన్నడలో బటర్ ఫ్లై అనే టైటిల్తో తెరకెక్కుతుండగా, తెలుగులో క్వీన్ వన్స్ అగైన్, తమిళంలో పారిస్ పారిస్, మలయాళంలో జామ్ జామ్ అనే టైటిల్స్ తో రూపొందుంది.

బాలీవుడ్ చిత్రం 'క్వీన్' ను నిర్మాత త్యాగరాజన్ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందిస్తుండగా, తెలుగు, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నీలకంఠ డైరెక్ట్ చేస్తున్నాడు. తమిళ, కన్నడ భాషల్లో రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఫ్రాన్స్ లో జరగగా, రీసెంట్ గా ముగిసింది. సినిమాకి ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే మించి వ్యయం కావడంతో ఈ ప్రాజెక్టు ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్ లో పడిందట. దాంతో ఏదో ఒక భాషలోని రీమేక్ ను ఆపేద్దామని నిర్మాత ఆలోచిస్తున్నాడట. మరి దీనిపై పూర్తి క్లారిటీ రావలసి ఉంది.

1477
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles