స‌మంత‌కి ఛాలెంజ్ విసిరిన పీవీ సింధు

Sun,August 12, 2018 09:49 AM
pv sindhu green challenge to samantha

రాష్ట్రాన్ని ప‌చ్చ‌ద‌నంతో నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సినీ సెల‌బ్రిటీలు, రాజ‌కీయ ప్ర‌ముఖులు గ్రీన్ ఛాలెంజ్ పేరుతో మొక్క‌లు నాటుతూ మిగ‌తా సెల‌బ్రిటీల‌కి ఛాలెంజ్ విసురుతున్నారు . ఈ క్ర‌మంలో వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ ఛాలెంజ్‌ని స్వీక‌రించిన పీవీ సింధు మూడు మొక్క‌లు నాటి హ‌రిత స‌వాల్‌ని మేరీ కోం, సూర్య, సమంతలకు పాస్ చేసింది. ఈ సంద‌ర్భంగా త‌న‌ని గ్రీన్ ఛాలెంజ్‌కి నామినేట్ చేసినందుకు లక్ష్మ‌ణ్‌కి ధ‌న్య‌వాదాలు తెలిపింది. భూమిని ప‌చ్చ‌గా ఉంచేందుకు అంద‌రు హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో పాల్గొంటారని ఆశిస్తున్నానంటూ ట్వీట్ చేసింది సింధు. ఇటీవ‌ల చైనాలో జ‌రిగిన వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ షిప్‌లో పీవీ సింధు ర‌జ‌త ప‌త‌కం గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే స‌మంత‌కి గ‌తంలో వంశీ పైడిప‌ల్లి గ్రీన్ ఛాలెంజ్ విస‌ర‌గా షూటింగ్ బిజీ వ‌ల‌న తాను ఇది స్వీక‌రించ‌లేక‌పోయింది. మ‌రి పీవీ సింధు ఛాలెంజ్‌నైన స‌మంత స్వీక‌రిస్తుందేమో చూడాలి. స‌మంత ప్ర‌స్తుతం యూ ట‌ర్న్ చిత్రంతో పాటు శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో చైతూ హీరోగా తెర‌కెక్కుతున్న సినిమాతో బిజీగా ఉంది.


4597
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS