మైఖేల్ జాక్సన్ అభిమానుల‌కి పూరీ బంప‌ర్ ఆఫ‌ర్

Wed,June 26, 2019 10:16 AM
puri jagannath surpise gift to michael fans

పాప్ సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టించిన రాక్ స్టార్ మైఖేల్ జాక్సన్ . ఆయ‌న సంగీతాన్ని విని యావ‌త్‌ ప్ర‌పంచం మైమ‌ర‌చిపోయింది. నలభై ఏళ్ళకు పైగా సంగీత ప్రపంచంలో భాగం అయిన మైఖేల్‌ 1970 ప్రాంతంలో పాప్ సంగీతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. జాక్స‌న్ 25 జూన్ , 2019న క‌న్నుమూశారు. ఆయ‌న ఈ లోకాన్ని వీడి నిన్న‌టితో ప‌ది సంవ‌త్స‌రాలు అయింది. ఈ సంద‌ర్భంగా మైఖేల్‌కి బిగ్ ఫ్యాన్ అయిన‌ పూరీ త‌న ట్విట్ట‌ర్‌లో జాక్స‌న్ అభిమానుల‌కి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చాడు. మైఖేల్‌కి తాను వీరాభిమానిని అని చెబుతూ ..మైఖేల్ జాక్సన్ వర్థంతి సందర్భంగా ఆయన అభిమానులందరినీ ట్విట్టర్ లో ఫాలో అవుతానని ప్రకటించారు పూరీ. అయితే నెటిజ‌న్స్ చేయాల్సిందేమంటే తన ట్వీట్ ను రీట్వీట్ చేయడమేనని వెల్లడించారు. తన పోస్టును రీట్వీట్ చేసినవారిని తప్పకుండా ఫాలో అవుతానని తన ట్వీట్ లో తెలిపారు. పూరీ జ‌గ‌న్నాత్ ప్ర‌స్తుతం ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో బిజీగా ఉన్నారు. రామ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని జూలై 18న విడుద‌ల చేయ‌నున్నారు.

1505
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles