డ్రగ్స్ కేసులో విచారణకు పూరీ జగన్నాథ్

Mon,July 17, 2017 07:10 PM
puri jagannadh to attend at sit in drugs case


హైదరాబాద్: డ్రగ్స్ కేసుకు సంబంధించి టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ఈ నెల 19న డైరెక్టర్ పూరీని సిట్ విచారించనుంది. డ్రగ్స్ కేసులో పూరీ జగన్నాథ్ సహా 12మంది సినీ ప్రముఖులకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సిట్ ఈ కేసుకు సంబంధించి విచారణను తొలి రోజు పూరీతో ప్రారంభించనుంది. అనంతరం మిగతావారిని ఒక్కొక్కరిగా సిట్ విచారించనుంది. హైద‌రాబాద్ డ్ర‌గ్స్ కేసులో ఈనెల 19 నుంచి 27 వ‌ర‌కు ఎక్సైజ్‌శాఖ అనుమానిత ఫిల్మ్‌స్టార్స్‌ను విచారించ‌నున్న‌ది. ఇటీవ‌ల ప‌ట్టుబ‌డిన‌ డ్ర‌గ్ రాకెట్ కేసులో సుమారు 12 మందిని ఇప్ప‌టికే పోలీసులు అరెస్టు చేశారు. వారి వ‌ద్ద నుంచి ఎల్ఎస్‌డీ, ఎండీఎంఏ మ‌త్తు ప‌దార్థాల‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ మార్కెట్లో కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే డ్ర‌గ్ రాకెట్ కేసును సీరియ‌స్‌గా తీసుకున్న రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారుల‌కు అన్ని ఆదేశాలు జారీ చేసింది. డ్ర‌గ్ ముఠా నాయ‌కుడు కెల్విన్ ఫోన్ లిస్టులో ఉన్న జాబితా ఆధారంగానే పోలీసులు ఫిల్మ్‌స్టార్స్‌కు నోటీసులు జారీ చేశారు. హైద‌రాబాద్‌లో ఉన్న పెద్ద కంపెనీల ఉద్యోగులు, కార్పొరేట్ స్కూళ్ల విద్యార్థులు కూడా డ్ర‌గ్‌కు బానిస‌ల‌వుతున్న‌ట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. ఈ కేసును డీల్ చేసేందుకు ఎక్సైజ్ చీఫ్ ఆఫీస‌ర్ అకున్ స‌బ‌ర్వాల్ కూడా త‌న లీవ్‌ను పోస్ట్‌పోన్ చేసుకున్న విష‌యం తెలిసిందే.

3165
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS